టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే ఈ క్రికెటర్ ఎప్పుడైతే తన భార్య నుంచి విడిపోయాడో అప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అతడు UK గాయని జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటి వరకు అతడు ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ ఆమె కనిపించింది. దీంతో వీరిద్దరి మధ్య డేటింగ్ రూమర్స్ వైరల్‌గా మారాయి.
హార్దిక్‌తో డేటింగ్‌పై రియాక్షన్
అలాగే దీని తర్వాత అతడు నటి ఇషా గుప్తాతో డేటింగ్ చేసినట్లు కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై తాజాగా నటి ఈషా గుప్తా ‘ ‘కాఫీ విత్ కరణ్’ షోలో మాట్లాడింది. హార్దిక్‌తో తన రిలేషన్‌పై స్పందించింది. గత కొంత కాలంగా తమ ఇద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని క్లారిటీ ఇచ్చారు. అయితే అది డేటింగ్ దశలోకి వెళ్లకముందే విడిపోయామని తెలిపింది.
కొన్ని నెలల పాటు తామిద్దరం మాట్లాడుకునే వాళ్లమని.. అలా తమ ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని పేర్కొంది. అలా అని తాము డేటింగ్‌లో ఉన్నామని అనుకోవడం లేదని తెలిపింది. తమ మధ్య మాటలు ప్రారంభం అయినప్పుడు.. డేటింగ్‌లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉండొచ్చు.. ఉండకపోవచ్చు అని ముందే ఫిక్స్ అయ్యామని చెప్పింది.
Also Read: కాల్పుల విరమణకు బ్రేక్.. ఇజ్రాయెల్‌పై మళ్లీ ఇరాన్ దాడులు
అయితే అలా మాట్లాడుకున్న తర్వాత రిలేషన్‌లోకి అడుగుపెట్టక ముందే తామిద్దరం విడిపోయామంది. కొన్ని నెలల పాటు సాగిన తమ మధ్య అనుబంధంలో కేవలం రెండు మూడు సార్లు మాత్రమే కలిశామని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అంతా ముగిసిపోయింది అని నటి ఇషా గుప్తా తెలిపారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్‌గా మారాయి.
Hardik Pandya - Esha Gupta: హార్దిక్ పాండ్యతో డేటింగ్‌పై నటి ఇషా ఫుల్ క్లారిటీ.. ‘రెండు మూడుసార్లు కలిశాం’
హార్దిక్ పాండ్యతో డేటింగ్ వార్తలపై నటి ఇషా గుప్తా స్పందించారు. కొంతకాలం తమ మధ్య స్నేహం ఉందన్నారు. తాము డేటింగ్ దశలోకి అడుగుపెట్టకముందే అంతా ముగిసిపోయిందన్నారు. కొన్నినెలల పాటు సాగిన తమ మధ్య అనుబంధంలో రెండు మూడు సార్లు కలిశామని చెప్పారు.
actress esha gupta comments on hardik pandya dating rumours
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే ఈ క్రికెటర్ ఎప్పుడైతే తన భార్య నుంచి విడిపోయాడో అప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అతడు UK గాయని జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటి వరకు అతడు ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ ఆమె కనిపించింది. దీంతో వీరిద్దరి మధ్య డేటింగ్ రూమర్స్ వైరల్‌గా మారాయి.
హార్దిక్‌తో డేటింగ్‌పై రియాక్షన్
అలాగే దీని తర్వాత అతడు నటి ఇషా గుప్తాతో డేటింగ్ చేసినట్లు కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై తాజాగా నటి ఈషా గుప్తా ‘ ‘కాఫీ విత్ కరణ్’ షోలో మాట్లాడింది. హార్దిక్‌తో తన రిలేషన్‌పై స్పందించింది. గత కొంత కాలంగా తమ ఇద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని క్లారిటీ ఇచ్చారు. అయితే అది డేటింగ్ దశలోకి వెళ్లకముందే విడిపోయామని తెలిపింది.
కొన్ని నెలల పాటు తామిద్దరం మాట్లాడుకునే వాళ్లమని.. అలా తమ ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని పేర్కొంది. అలా అని తాము డేటింగ్‌లో ఉన్నామని అనుకోవడం లేదని తెలిపింది. తమ మధ్య మాటలు ప్రారంభం అయినప్పుడు.. డేటింగ్‌లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉండొచ్చు.. ఉండకపోవచ్చు అని ముందే ఫిక్స్ అయ్యామని చెప్పింది.
Also Read: కాల్పుల విరమణకు బ్రేక్.. ఇజ్రాయెల్‌పై మళ్లీ ఇరాన్ దాడులు
అయితే అలా మాట్లాడుకున్న తర్వాత రిలేషన్‌లోకి అడుగుపెట్టక ముందే తామిద్దరం విడిపోయామంది. కొన్ని నెలల పాటు సాగిన తమ మధ్య అనుబంధంలో కేవలం రెండు మూడు సార్లు మాత్రమే కలిశామని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అంతా ముగిసిపోయింది అని నటి ఇషా గుప్తా తెలిపారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్‌గా మారాయి.
Also Read: ఈపీఎఫ్ఓ చందాదారులకు అదిరిపోయే న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు!