/rtv/media/media_files/2026/02/22/gifts-a-car-2026-02-22-18-35-41.jpg)
భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా(hardik-pandya) తన కుమారుడు అగస్త్య పట్ల తనకున్న ప్రేమని చాటుకున్నారు. కేవలం ఐదేళ్ల వయసున్న అగస్త్యకు సుమారు రూ.4 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ లగ్జరీ కారును బహుమతి(car gift to son) గా ఇచ్చాడు. ముంబయిలోని ఒక ప్రముఖ కారు షోరూమ్‌లో అగస్త్య స్వయంగా కారు కీని అందుకున్న వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Also Read : తొలి సూపర్-8 మ్యాచ్ రద్దు.. కివీస్-పాక్‌కు చెరో పాయింట్
Hardik Pandya Gifts A Car To His Son
Hardik Pandya gifts his son and ex wife a new Land Rover Defender.
— Avneesh Mishra (@RajaMishra007) February 22, 2026
A ₹4 Crore Land Rover Defender doesn't change diapers. 🚗💨
Stop praising the money. Start questioning the absence. Parenting is about being there, not just sending a flatbed truck to Mumbai. 💔#INDvsSApic.twitter.com/VpImxSzHKV
Also Read : రెండో పెళ్లి చేసుకున్న శిఖర్ ధావన్! .. ఫోటోలు వైరల్!
ఈ ప్రత్యేక సందర్భంలో హార్దిక్ మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ కూడా అక్కడే ఉండటం విశేషం. 2020లో వివాహం చేసుకున్న ఈ జంట, కొన్ని విభేదాల కారణంగా 2024లో విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే, కుమారుడి సంతోషం కోసం వీరిద్దరూ కలిసి షోరూమ్‌కు రావడం నెటిజన్లను ఆకట్టుకుంది. తల్లిదండ్రులుగా తమ బాధ్యతను నెరవేరుస్తూ, అగస్త్య అడిగిన కోరికను హార్దిక్ తీర్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంపై సరికొత్త చర్చ మొదలైంది. ఆయన ప్రస్తుతం మహిక శర్మతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చేలా హార్దిక్ తన మెడపై ఒక కొత్త పచ్చబొట్టు వేయించుకున్నారు. రెండు చిరుతపులి చిత్రాల మధ్యలో 'M' అనే ఆంగ్ల అక్షరం ఉండేలా ఈ టాటూ ఉంది. ఇది మహిక పేరులోని మొదటి అక్షరమేనని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అటు ఆటలోనూ, ఇటు వ్యక్తిగత విషయాల్లోనూ హార్దిక్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
Follow Us