Mahieka Sharma : కొత్త మోడల్ తో హార్దిక్ పాండ్యా డేటింగ్.. ఎవరీ మహీకా శర్మ?

ప్రముఖ భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన వ్యక్తిగత జీవితం కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు. మాజీ భార్య నటాషా స్టాన్కోవిచ్‌తో విడిపోయిన తర్వాత, ఇప్పుడు ఆయన మోడల్ , నటి మహీకా శర్మతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

New Update
pandya

ప్రముఖ భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన వ్యక్తిగత జీవితం కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు. మాజీ భార్య నటాషా స్టాన్కోవిచ్‌తో విడిపోయిన తర్వాత, ఇప్పుడు ఆయన మోడల్ , నటి మహీకా శర్మతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. దీంతో మహీకా శర్మ ఎవరని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. మహీకా శర్మ 24 ఏళ్ల మోడల్, నటి. ఆమె తన అందం, నైపుణ్యంతో ఫ్యాషన్ పరిశ్రమలో వేగంగా గుర్తింపు పొందుతున్నారు.  మోడలింగ్ రంగంలోకి రాకముందు ఆమె చాలా చదువుకున్నారు. 10వ తరగతిలో 10 CGPA సాధించారు. ఆ తర్వాత ఎకనామిక్స్ మరియు ఫైనాన్స్ చదివారు. యోగా టీచర్ శిక్షణ కూడా పూర్తి చేశారు.ఫ్యాషన్ ప్రపంచంలో టాప్ డిజైనర్లయిన మనీష్ మల్హోత్రా, అనితా డోంగ్రే, తరుణ్ తాహిలియాని వంటి వారి కోసం ఆమె ర్యాంప్ వాక్ చేశారు.

Also Read :  Iran-Israel: ఇజ్రాయెల్‌కు గూఢచర్యం.. నిందితుడిని బహిరంగంగా ఉరితీసిన ఇరాన్

2024లో ఇండియన్ ఫ్యాషన్ అవార్డ్స్‌లో 'మోడల్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెలుచుకున్నారు. కొన్ని మ్యూజిక్ వీడియోలు,  షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా నటించారు. హార్దిక్ పాండ్యా, మహీకా శర్మ డేటింగ్ చేస్తున్నట్లుగా  సోషల్ మీడియా వార్తలు వస్తున్నాయి. ఒక రెడిట్ పోస్ట్‌లో, మహీకా శర్మ తన సెల్ఫీలో వెనుక అస్పష్టంగా ఉన్న ఒక మగ వ్యక్తిని చూపించింది. ఆ వ్యక్తి హార్దిక్ పాండ్యా అని అభిమానులు అనుమానించారు.

Also Read : Breaking: ఏడీఈ అంబేడ్కర్‌కు మరో షాక్‌.. స్నేహితుడి ఇంట్లో అక్రమాస్తులు గుర్తించిన ACB

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో

అంతేకాకుండా, మహీకా ఒక పోస్ట్‌లో హార్దిక్ పాండ్యా జెర్సీ నంబర్ అయిన 33ను చూపించడం కూడా ఈ పుకార్లకు బలం చేకూర్చింది.ఈ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవుతున్నారు కూడా. తాజాగా జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌ల సమయంలో మహీకా దుబాయ్‌లో ఉన్నారని, భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను చూస్తూ కనిపించారని కూడా వార్తలు వచ్చాయి.అయితే, ఇప్పటివరకు ఈ పుకార్లపై హార్దిక్ పాండ్యా గానీ, మహీకా శర్మ గానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.అటు గతంలో హార్దిక్ పాండ్యా చాలామందితో డేటింగ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాతో కూడా చాలా సార్లు వినిపించింది.

Also Read :  Yogi Adityanath : దటీజ్ యోగి.. దిశాపటానీ ఇంటిపై కాల్పులు జరిపిన ఇద్దరు ఖతం !

Advertisment
తాజా కథనాలు