Hardik Pandya: గర్ల్‌ఫ్రెండ్‌తో బీచ్‌లో చిల్ అవుతున్న హార్దిక్‌.. ఈ నెల 11న గుడ్ న్యూస్ చెప్పనున్నాడా?

స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన గర్ల్‌ ఫ్రెండ్ మహికా శర్మతో ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్‌ ఫొటోల్లో వీరి ప్లేస్‌లో 11:11 అని ఉంది. ఈ నెల 11వ తేదీన ఏదైనా గుడ్ న్యూస్ చెబుతారా? అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.

New Update
Hardik pandya

Hardik pandya

స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా(hardik-pandya) కొన్ని రోజులు క్రికెట్‌కు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం తన గర్ల్‌ ఫ్రెండ్ మహికా శర్మతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వీరిద్దరూ కలిసి టూర్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేశారు. బీచ్‌లో ఇద్దరూ దగ్గరగా ఉంటున్న వీరి ఫొటోల్లో ఒకదానిపై 11:11 అని ఉంది. దీంతో ఫ్యాన్స్ దీని అర్థం ఏంటని ఆలోచిస్తున్నారు. అయితే వీరిద్దరు ఎప్పటి నుంచో డేటింగ్‌(dating)లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇది కూడా చూడండి: ICC: పాక్ క్రికెటర్ రవుఫ్ కు ఐసీసీ పనిష్మెంట్..సూర్యకుమార్, బుమ్రాలకు జరిమానా

ఏదైనా గుడ్ న్యూస్ చెబుతారా?

గతంలో పలుమార్లు వీరిద్దరి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు వీరు ఈ నెల 11వ తేదీన ఏదైనా గుడ్ న్యూస్ చెబుతారా? అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. పెళ్లి గురించి ఏదైనా అప్డేట్ ఇస్తారా? అనే కోణంలో ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే గతంలో అక్టోబర్ 11వ తేదీన హార్దిక్ పాండ్యా బర్త్‌డే జరగ్గా.. వాటిని కూడా మహికాతో కలిసి చేసుకున్నాడు. అప్పటి నుంచే వీరు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు తాజాగా షేర్ చేసిన ఫొటోతో అయితే క్లారిటీ వచ్చిందని నెటిజన్లు అంటున్నారు. మరి అదేంటో తెలియాలంటే నవంబర్ 11వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇది కూడా చూడండి: HBD Kohli: పడి లేచిన క్రికెట్ కెరటం.. సచిన్ వరల్డ్ రికార్డ్ బద్దలు చేసిన బ్యాటింగ్ దిగ్గజం.. కోహ్లీ గురించి ఈ విషయాలు తెలుసా?

Advertisment
తాజా కథనాలు