/rtv/media/media_files/2025/10/11/hardik-pandya-new-girlfriend-2025-10-11-07-33-18.jpg)
Hardik Pandya New Girlfriend
టీమిండియా ఆల్‌రౌండర్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో తిరుగుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మోడల్ మహీకా శర్మతో హార్దిక్ పాండ్యా డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా వీరిద్దరూ ముంబై ఎయిర్‌పోర్టులో కలిసి కనిపించడంతో ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. కావాలని హార్దిక్ పాండ్యా ఈ విషయాన్ని బయటకు తెలియజేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే హార్దిక్ పాండ్యా, మహీకా శర్మ కలిసి ముంబై విమానాశ్రయానికి చేరుకున్నారు. మొదటగా హార్దిక్ తన కారులోంచి దిగి, మహీకా కోసం కొద్దిసేపు వేచి చూశాడు. ఆ తర్వాత మహీకా కారు నుండి దిగి, హార్దిక్ చేతిని పట్టుకోవడానికి అతని వైపు పరుగెత్తింది.
ఇది కూడా చూడండి: Rinku Singh : రూ. కోట్లు ఇస్తావా.. చస్తవా.. రింకు సింగ్ కు దావూద్ గ్యాంగ్ బెదిరింపులు
Hardik Pandya has found new love. Cricketer Hardik Pandya has finally confirmed his new relationship with 24-year-old model Mahika Sharma, who was spotted at the Mumbai airport.#HardikPandya#MahikaSharmapic.twitter.com/qxJFcGfL7C
— Urmila (@Urmila_95) October 10, 2025
హార్దిక్ ఆమెను చూసి, మొదట విమానాశ్రయ గేటు వైపు వెళ్లమని సైగ చేశాడు. కెమెరాలకు పోజులివ్వకుండా ఇద్దరూ కలిసి టెర్మినల్ గేటు వైపు వేగంగా నడిచారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే హార్దిక్ పాండ్యా, మహీకా శర్మ కలిసి కనిపించడం ఇది మొదటిసారి కాదు. మరోసారి వీరు జంటగా రావడంతో వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై ఒక క్లారిటీ వచ్చిందని అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. హార్దిక్, మహీకా డేటింగ్ ఖచ్చితంగా నిజమే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి వ్యక్తిగత జీవితంలో ఒంటరిగా ఉన్న హార్దిక్ పాండ్యా మహీకా శర్మతో డేటింగ్ పుకార్లపై వీరిద్దరూ ఇంకా స్పందించలేదు.
ఇంతకీ మహీకా శర్మ ఎవరు?
హార్దిక్‌తో డేటింగ్ వార్తలతో వార్తల్లో నిలిచిన మహీకా శర్మ ఒక మోడల్. ఈ 24 ఏళ్ల అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ప్రాచుర్యం ఉంది. ఆమెకు ఏకంగా 51 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. మహీకా శర్మ గుజరాత్‌లోని పండిట్ దీనదయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. అలాగే యుఎస్‌లోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలో కమ్యూనిటీ సైకాలజీని కూడా చదివింది. మహీకా కొన్ని సినిమాల్లో సహాయ పాత్రలలో నటించింది. వీటిలో వివేక్ ఒబెరాయ్‌తో కలిసి నటించిన 'ఇన్ టు ది డస్క్', ఓమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన 'పీఎం నరేంద్ర మోడీ' సినిమాలు ఉన్నాయి. ఆమె తనిష్క్, వివో, యునిక్లో వంటి పెద్ద బ్రాండ్‌ల ప్రకటనల్లో కూడా కనిపించింది. అనితా డోంగ్రే, మనీష్ మల్హోత్రా వంటి ప్రముఖ భారతీయ డిజైనర్ల కోసం ఆమె ర్యాంప్ వాక్ చేసింది.
ఇది కూడా చూడండి: Women's World Cup: వరల్డ్ కప్ లో భారత మహిళలకు మొదటి ఓటమి..సౌతాఫ్రికా చేతిలో..