IPL 2025: తిలక్ వర్మకు ఘోర అవమానం..  హార్దిక్‌ ఇది నీకు న్యాయమేనా?

లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడిన ముంబై జట్టు 12 పరుగులు తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు ఘోర అవమానం జరిగింది. 19వ ఓవర్‌లో తిలక్ వర్మను రిటైర్డ్ అవుట్ అయ్యేలా చేశారు. దీంతో హార్దిక్‌పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.

New Update
Tilak Varma Mi

Tilak Varma Mi Photograph: (Tilak Varma Mi)

ఐపీఎల్‌లో ముంబై జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడిన ముంబై జట్టు ఓటమి పాలైంది. కేవలం 12 పరుగులు తేడాతో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు ఘోర అవమానం జరిగింది. తిలక్ వర్మ 2022 నుంచి ముంబై ఇండియన్స్‌లో ఆడుతున్నాడు. అయితే నిన్న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మను రిటైర్డ్ అవుట్ అయ్యేలా చేశారు.

ఇది కూడా చూడండి: Bengaluru : పాపం.. అలోవెరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగింది!

ఇది కూడా చూడండి: TG Crime : ఏం మనిషివిరా నువ్వు..ఆరోగ్యం బాలేక.. స్నేహితుడిని నమ్మి కూతుర్ని అప్పగిస్తే!

గతంలో హార్దిక్ పాండ్యా కూడా..

ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన తిలక్ వర్మ 23 బంతుల్లో 25 పరగులు చేశాడు. అయితే నెమ్మదిగా ఆడుతున్న తిలక్ వర్మను హార్దిక్ పాండ్యా రిటైర్డ్ ఔట్ అయ్యేలా చేశాడు. దీంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గతంలోనూ హార్దిక్ పాండ్యా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 బంతుల్లో 11 పరుగులు చేశాడు. కానీ అప్పుడు హార్దిక్‌ను రిటైర్డ్ అవుట్ చేయలేదు. ఇప్పుడు తిలక్ వర్మను రిటైర్డ్ అవుట్ చేయడంతో మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ టెస్టు ప్లేయర్ హనుమ విహారీలు ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. 

ఇది కూడా చూడండి: Actor Darshan Arrest: జడ్జి కుమారుడిపై దాడి.. నటుడు & బిగ్ బాస్ ఫేం కంటెస్టెంట్‌ అరెస్టు

ఇది కూడా చూడండి: Earthquake: మరోసారి భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు- ఈసారి ఎక్కడంటే?

 

telugu-news | latest sports News | hardik-pandya | tilak-verma | telugu-sports-news | telugu-cricket-news | latest-telugu-news | today-news-in-telugu | IPL 2025

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు