Onions : కోయ కుండానే ఏడిపిస్తున్న ఉల్లి.. కిలో ఉల్లి 30పైసలే..
ఆంధ్రప్రదేశ్ లో ఉల్లిధరలు పతనమయ్యాయి. కోయకుండానే రైతులను ఏడిపిస్తున్నాయి. ఏపీలో ఉల్లి పంట రైతుల కంట కన్నీరు తెప్పిస్తోంది. కిలో ఉల్లిధరలు కేవలం 30 పైసలకు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఉల్లిధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు లభోదిబోమంటున్నారు.