/rtv/media/media_files/2025/01/05/WqQdaRzSzpqkTP9Y9G3Z.jpg)
KTR
ఉపరాష్ట్రపతి ఎన్నికపై బీఆర్‌ఎస్(brs) వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. మేము ఏ కూటమిలో లేమన్న ఆయన మద్ధతు కోసం ఎవరూ తమను సంప్రదించలేదని స్పష్టం చేశారు.ఈ రోజు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన వ్యక్తిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని కేటీఆర్(ktr) స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక పేరుతో జరిగేదంతా డ్రామా ఆయన కొట్టి పడేశారు.రాహుల్‌గాంధీ, మోదీ మా బాస్ కాదు తెలంగాణ ప్రజలే మా బాస్ అని స్పష్టం చేశారు. తెలంగాణకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎవరిస్తారో వారికే మా మద్దతు అని తెలిపారు.తెలంగాణ నుంచి బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలేదో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. బీసీల మీద ప్రేమ నోటిపైనేనా.. చేతల్లో ఉండదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఇది కూడా చూడండి:కవితకు ఊహించని షాకిచ్చిన కేసీఆర్.. ఆ పదవి నుంచి ఔట్!
KTR Makes A Statement On Vice Presidential Elections
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత రెండు నెలలు గా తెలంగాణలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. కేసీఆర్ హయాంలో ఆరు నెలల ముందే ఎరువుల బస్తాలు సిద్ధంగా ఉంచేవారన్నారు. ఇప్పుడు ఒక ప్రణాళిక కూడా చేయట్లేదని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ దున్నపోతు మీద వాన కురిసిన విధంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఢిల్లీకి వారి నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) ని కలవడానికి వెళ్లినప్పుడల్లా రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎదో ఒక పేపర్ ఇచ్చి వస్తున్నారన్నారు. ఇక్కడ పోలీసులను పెట్టి ఎరువుల బస్తాలు అమ్మే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పడుతున్న కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదని.. చిల్లర రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసని సంచలన కామెంట్స్ చేశారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
Also Read: Telangana Rain: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ
ఏ ఊరికి పోయినాఎరువుల కోసం చేంతాడు అంత లైన్ కనిపిస్తుందని, ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని ప్రభుత్వం మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు. 24 గంటలు బురద రాజకీయాలు చేస్తున్నారని, , బ్లాక్ మార్కెట్ లో కాంగ్రెస్ నేతలు అమ్ముతున్నారు అనే అనుమానం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఏమో కొరత లేదు అంటున్నాడని, ఢిల్లీలో వాళ్ళ ఎంపీ లు ఏమో యూరియా కోసం ధర్నా లు చేస్తున్నారని, పదేళ్ల లో రాని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు.