/rtv/media/media_files/2025/08/13/women-farmers-india-2025-08-13-13-46-56.jpg)
women farmers india
Women Farmers : వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.దీనికోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకం కోసం రూ. 41.83 కోట్ల నిధులు కేటాయించింది. ధరఖాస్తులను 14 వరకు పూర్తి చేసి నెలరోజుల్లో లబ్దిదారులకు వ్యవసాయ పనిముట్లు అందించేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్‌కెవీవై) ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ పథకంలో భాగంగా రైతులకు ఈ పనిముట్లు అందించనున్నారు. ఈ సబ్సీడీలో 60 శాతం కేంద్రం , 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకాన్ని ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీ మహిళలకే ఇవ్వాలని నిర్ణయించారు.వ్యవసాయ యాంత్రీకరణలో బ్యాటరీ స్రేయర్లు, తైవాన్లు, డ్రోన్, రోటోమీటర్లు, విత్తనములు, ఎరువులు వేసే యంత్రాలు, కల్టివేటర్, కేజీ వీల్, బండ్ ఫార్మర్, పవర్ వీడర్, బుష్ కట్టర్లు, పవర్ టిట్లర్లు, ట్రాక్టర్లు, మెజ్ షెల్టర్లు, ఎంబి ప్లన్, వరిగడ్డి కట్టలు కట్టే యంత్రాలు రాయితీపై అందజేయనున్నారు.
Also Read: అమెరికాలో ఇంటిపై పడిన ఉల్క.. షాకింగ్ విషయాలు వెల్లడించిన సైంటిస్టులు!
అయితే మహిళలకు 50% రాయితీ ఇస్తున్నందున భూమి పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, ట్రాక్టర్ (ఆర్ సి ట్రాక్టర్ కు సంబంధించిన పరికరాలకు మాత్రమే) మహిళ పేరుతో దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల వ్యవసాయ అధికారి కార్యాలయాలతో పాటు క్లస్టర్ ఏఈఓ ల వద్ద దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. అర్హులైన వారందరికీ రాయితీపై వ్యవసాయ పరికరాలను ప్రభుత్వం అందజేయనున్నది.
Also Read : వంగా మామూలుగా లేదు.. 'స్పిరిట్' ఫస్ట్ షెడ్యూల్ అక్కడ ప్లానింగ్!
ఒక లక్ష కంటే ఎక్కువ విలువ ఉన్న పనిముట్లు తీసుకోవాలంటే కనీసం ఒక ఎకరం భూమి కలిగి ఉండాలి. కస్టమ్ హైరింగ్ సెంటర్లు , కిషాన్ డ్రోన్లు మంజూరు చేయడానికి మాత్రం2.5 ఎకరాల భూమి ఉండాలనే నిబంధన పెట్టారు, కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు గడచిన ఐదేళ్లుగా మనుగడలో ఉన్న రైతుమిత్ర గ్రూపులు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు , స్వయం సహయక సంఘాలకు అవకాశం ఇచ్చారు. నెలరోజుల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
Also Read : ఖమ్మంకు ఓ న్యాయం.. నల్లగొండకో న్యాయమా?: మంత్రి పదవిపై మరోసారి భగ్గుమన్న కోమటిరెడ్డి!