/rtv/media/media_files/2025/10/30/tummala-2025-10-30-22-01-16.jpg)
తెలుగు రాష్ట్రాలను మొంథా తుఫాను అతలాకుతలం చేసింది. దీని వలన ఇరు రాష్ట్రాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికి వచ్చిన పంటలు నీట మునిగిపోయాయి. తెలంగాణలో 4.5 లక్షల ఎకరాల పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రైతులకు భరోసా ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున అందిస్తామన్నారు. పశుసంపద, ఇళ్ళు నష్టపోయినా ఆదుకుంటామని తెలిపారు. అలాగే 80 లక్షల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తుమ్మల చెప్పారు. మార్కెట్‌లో తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనాలని ఆదేశించామని.. 11 లక్షల టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
రేపటి నుంచి రైతుల వివరాలు నమోదు..
మరోవైపు రేపటి నుంచి వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేయనున్నారు. పంట నష్టపోయిన ప్రతీ రైతు వివరాలను నమోదు చేయనున్నారు. అధిక వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులను ఆదుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రైతులను ఆదుకుంటామని చెప్పారు. గత ఏడాది వరదల్లోనూ భారీగా పంట నష్టం జరిగినా కేంద్రం సాయం చేయలేదు. ఇప్పుడు కూడా కేంద్రానికి లెక్కలు చెబుతామని..కానీ గత ఏడాది చెప్పిన దానికే ఇంకా స్పందించలేదని తుమ్ముల వివరించారు. ఖమ్మంలో మున్నేరు వరద ఉద్ధృతిని పరిశీలించిన తర్వాత మంత్రి ఈ ప్రకటనను జారీ చేశారు.
🌪️రాష్ట్రంలో మొoథా తుఫాన్ ప్రభావం 🌾
— IPRDepartment (@IPRTelangana) October 30, 2025
🔸 4,47,864 ఎకరాల్లో పంట నష్టం
🔸 వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎక్కువగా నష్టం
🔸 వ్యవసాయ శాఖ ప్రాధమిక నివేదికలో వివరాలు వెల్లడి
🔸 పూర్తి స్థాయి సర్వేతో పంట నష్టం పెరగొచ్చు
🔸 నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం
– వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల… pic.twitter.com/pwKxZTjDoJ
Also Read: 67 Word: వర్డ్ ఆఫ్ ద ఇయర్ 67..జెన్ ఆల్ఫా తెగ వాడుతున్న ఈ పదం గురించి మీకు తెలుసా?
 Follow Us
 Follow Us