/rtv/media/media_files/2025/08/21/ktr-sensational-tweet-on-revanth-reddy-2025-08-21-20-07-53.jpg)
KTR sensational tweet on Revanth Reddy
KTR : రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఒకవైపు వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. కానీ, రైతులకు సకాలంలో ఎరువులు దొరకడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని రాష్ర్ట ప్రభుత్వం ఆరోపిస్తుంటే, యూరియా కొరత లేదని కేంద్రం చెప్తూ వస్తోంది. దీంతో వందలాదిమది రైతులు జిల్లాల్లో ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్‌ల వద్ద పడిగాపులు పడుతున్నారు. యూరియా కోసం ఎదురు చూస్తూ రైతులు రాత్రుళ్లు సైతం జాగారం చేస్తున్నారు. షాపుల ముందు వందలాది మంది రైతులు గంటల తరబడి బారులు తీరుతున్నారు. రాష్ర్ట మంత్రులు, అధికారులు మాత్రం ఎరువుల కొరత లేదంటున్నారు. అంతేకాదు అసలు రైతులు ఎక్కడ బారులు తీరడం లేదంటూ చెప్తున్నారు.
Also Read:'నోరా ఫతేహి'లా మారుతావా లేదా లేపేయన..? భార్యకు 3 గంటలు జిమ్‌లో చుక్కలు చూపించిన భర్త..!
కానీ, రాష్ట్రంలో ఎరువుల కొరత ఉందని రైతుల ఆందోళనలు, బారీ లైన్లు స్పష్టం చేస్తున్నాయి. సమయానికి ఎరువులు అందక, అందినా పరిమితంగా యూరియా పంపిణీ చేస్తుండటంతో అన్నదాతల నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. రేవంత్.. నీ దరిద్రిపుగొట్టు పాలనకు దక్కిన అసమర్థ ఆస్కార్ అవార్డు ఇది అంటూ వనపర్తి జిల్లా ఆత్మకూరు పీఏసీఎస్ ఎదుట చెప్పుల క్యూలైన్ వద్ద ఓ రైతు పడుకున్న ఫొటోను షేర్ చేశారు. అంతేకాదు..
ఇది కూడా చదవండి:తెలంగాణ రైతులకు శుభవార్త.. కొత్త పాస్‌బుక్ వచ్చిన వారందరికీ ఈ నెలలో రైతు బీమా
ఆ ఫొటోను ఫ్రేమ్ కట్టించుకుంటావో.. మెడలో వేసుకుని ఊరేగుతావో నీ ఇష్టం అంటూ తీవ్రంగా ఆక్షేపించారు. అన్నదాతను ‘అప్పులపాలు’ చేసిన.. చేతకాని పాలకులను చూశాం కానీ.. ‘చెప్పులపాలు’ చేసిన చెత్త రికార్డు మాత్రం నీదేననంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారు. బస్తా యూరియా కోసం.. రైతు బతుకును బజారున పడేశావంటూ కేటీఆర్ రేవంత్‌పై ధ్వజమెత్తారు. అందరి కడుపునింపే అన్నదాతను.. పాదరక్షల పాల్జేసిన నీ పాపం ఊరికే పోదు.. జై కిసాన్.. జై తెలంగాణ అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
Also Read: Crime News: మరో భర్త బలి.. మరిగే నూనె పోసి అతి కిరాతంగా హత్య చేసిన భార్య