Crypto Fraud : తెలంగాణలో రైతుల పేర్లతో భారీమోసం..రూ.170 కోట్ల క్రిప్టో కరెన్సీ లావాదేవీలు

తెలంగాణలో మరో  క్రిప్టో కరెన్సీ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రైతులు, వ్యవసాయ కూలీలపేరుతో రూ.170 కోట్లకు పైగా విలువైన మోసపూరిత క్రిప్టో లావాదేవీలు నిర్వహించినట్లు ఇన్‌కంటాక్స్‌ అధికారుల విచారణలో తేలింది.

New Update
 Crypto Fraud

Crypto Fraud

Crypto Fraud : ఈజీ మనీకి అలవాటు పడిన పలువురు  క్రిప్టో కరెన్సీ, ఫిక్స్‌‌డ్ డిపాజిట్లు, ట్రేడింగ్‌‌‌, రియల్‌‌‌‌‌‌ఎస్టేట్‌‌‌‌‌వంటి పేర్లతో అమాయకులను మోసం చేస్తున్నారు.వివిధ పేర్లతో నకిలీ సంస్థలను సృష్టించి బాధితుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. అలాంటిదే తెలంగాణలో మరో  క్రిప్టో కరెన్సీ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగుల పేరుతో నకిలీ అకౌంట్లు సృష్టించి కోట్లాది రూపాయల లావాదేవీలు చేస్తున్న వ్యవహారం వెలుగు చూసింది. ఈ ముఠా ఇప్పటివరకు ఏకంగా సుమారు రూ.170 కోట్లకు పైగా విలువైన మోసపూరిత క్రిప్టో లావాదేవీలు నిర్వహించినట్లు ఇన్‌కంటాక్స్‌ అధికారుల విచారణలో తేలింది.

Also Read : Anaganaga Oka Raju: ఏం ఫీలుంది మామ! జోగిపేట్ శ్రీకాంత్ ఈజ్ బ్యాక్ .. ఈ సంక్రాంతికి పండగే


 కూలీలు, రైతులు, ఉద్యోగుల పేర్లతో పలువురు నిందితులు నకిలీ అకౌంట్లు సృష్టించి కోట్ల రూపాయల లావాదేవీలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు సుమారు రూ.170 కోట్ల విలువైన మోసపూరిత క్రిప్టో లావాదేవీలు జరిగినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు.ఈ మోసాలు ఎక్కువగా సిద్దిపేట, ఖమ్మం, హైదరాబాద్‌, జగిత్యాల, సత్తుపల్లి తదితర జిల్లాలకు చెందిన ప్రాంతాల్లో జరిగినట్లు దర్యాప్తులో తేలింది. పాన్‌కార్డులను ఉపయోగించి నకిలీ అకౌంట్లు తెరివడం ద్వారా ఈ  లావాదేవీలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా దీనికి సంబంధించి ఇప్పటి వరకు 20కి పైగా మోసాల వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: అయ్యో బిడ్డలు.. ఆడుకోవడానికి వెళ్లి అనంతలోకాలకు.. విషాదాంతమైన నెల్లూరు చిన్నారుల మిస్సింగ్!


కాగా ఈ లావాదేవీలన్నీ కూడా సామాన్యుల పేరుతో జరగడం గమనార్హం. అధికారులు గుర్తించిన దాని ప్రకారం హైదరాబాద్‌ లాలా గూడకు చెందిన  వాటర్ ప్లాంట్ ఉద్యోగి పేరుతో రూ.34 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తేలింది. అలాగే ఖమ్మంలో ఫార్మా ఉద్యోగి పేరుతో రూ.19 కోట్లు, సిద్దిపేట రైతు పేరుతో రూ.9 కోట్లు లావాదేవీలు నిర్వహించినట్లు వెల్లడించారు. సత్తుపల్లిలోనూ రైతు పేరుతో రూ.31 కోట్ల లావాదేవీలు జరిపినట్లు విచారణలో తెలినట్లు తెలుస్తోంది. అలాగే జగిత్యాల డెలివరీ బాయ్ పేరుతో రూ.20 కోట్ల లావాదేవీలు చేసినట్లు అధికారులు గుర్తించారు. కాగా  ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలువురుఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ప్రజల పేర్లతో కోట్లాది రూపాయల  క్రిప్టో లావాదేవీలు జరపడం వెనుక పెద్ద రాకెట్ ఉందని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు.

Also Read: AP Crime: మనసును కలచివేసే ఘటన... అనంతపురంలో వేడి పాల గిన్నెలో పడి బాలిక మృతి

Advertisment
తాజా కథనాలు