Flight: విమానం గాల్లో ఉండగా ఢీ కొట్టిన పక్షి..
ఈ మధ్య విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం, అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం లాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహరాష్ట్రలోని పుణె నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఆకాశ ఎయిర్ ఫ్లైట్‌ను పక్షి ఢీకొట్టింది.
ఈ మధ్య విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం, అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం లాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహరాష్ట్రలోని పుణె నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఆకాశ ఎయిర్ ఫ్లైట్‌ను పక్షి ఢీకొట్టింది.
కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీస్‌ను ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో విమానయాన శాఖ ఈ సర్వీస్‌ను తీసుకొచ్చింది.
ఎయిర్పోర్ట్ సిబ్బందిని తప్పించుకొని 13 ఏళ్ల ఆఫ్ఘన్ బాలుడు కాబూల్ నుంచి ఢిల్లీకి విమానలో వచ్చాడు. అది కూడా ల్యాండింగ్ గేర్ లోపల దాక్కుని. రెండు గంటల పాటు ల్యాండింగ్‌లో ప్రమాదకరంగా ప్రయాణించాడు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.
అగ్రరాజ్యమైన అమెరికాలో విమాన ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. టెలికాం సేవల్లో సాంకేతిక సమస్యలు రావడంతో డల్లాస్ సహా పలు ఎయిర్‌పోర్టులలో 1800 పైగా విమానాలపై ప్రభావం పడినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అధికారులు తెలిపారు.
ముంబై విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతున్న ఓ స్పైస్‌జెట్ విమానం చక్రం ఊడిపోయింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో విమానం అత్యవసరంగా వెనక్కి తిరిగి క్షేమంగా ల్యాండ్ అయ్యింది.
మరో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం లో చిక్కుకుంది. దీనిలో కేసీ వేణుగోపాల్ లాంటి కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఫ్లైట్ ను దారి మధ్యలో చెన్నైలో ల్యాండ్ చేశారు.
గాల్లో ఉన్న విమానంలో ఓ ప్రయాణికుడు హల్చల్ చేశాడు. విమానాన్ని గాల్లో ఉండగానే బాంబుతో పేల్చేస్తానంటూ కేకలు వేశాడు. దీంతో ప్రయాణీకులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. లండన్ నుంచి గ్లాస్గో వెళ్తున్న ఈజీ జెట్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వరుస విమాన ప్రమాదాలు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. బంగ్లాదేశ్ ఢాకాలో ఎయిర్‌ఫోర్స్ శిక్షణ విమానం కాలేజీపై కూలిపోయింది. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. అధికారుల వెంటనే కాలేజీ దగ్గరకి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.
రేణిగుంట, హైదరాబాద్ ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో పైలట్లు విమానాన్ని 40 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టించి, చివరికి తిరుపతిలోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు.