Flight: విమానం గాల్లో ఉండగా ఢీ కొట్టిన పక్షి..

ఈ మధ్య విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం, అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం లాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహరాష్ట్రలోని పుణె నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఆకాశ ఎయిర్‌ ఫ్లైట్‌ను పక్షి ఢీకొట్టింది.

New Update
Akasa Air Flight From Pune To Delhi Suffers Bird Strike, Lands Safely

Akasa Air Flight From Pune To Delhi Suffers Bird Strike, Lands Safely

ఈ మధ్య విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం, అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం లాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహరాష్ట్రలోని పుణె నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఆకాశ ఎయిర్‌ ఫ్లైట్‌ను పక్షి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. చివరికి విమానాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు ఎయిర్‌లైన్స్ ప్రతినిధి వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళ్తే శుక్రవారం ఆకాశ ఎయిర్‌లైన్స్‌(akasa-air-lines) కు చెందిన విమానం పుణె నుంచి ఢిల్లీకి బయలుదేరింది.  

Also Read: వెస్ట్ బెంగాల్ లో మరో దారుణం.. MBBS స్టూడెంట్ పై రేప్.. ఫోన్ లాక్కుని

విమానం గాల్లో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వచ్చిన ఓ పక్షి దాన్ని ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. విమానం ఢిల్లీలో సేఫ్‌గా ల్యాండ్ అయిన తర్వాత ఇంజినీరింగ్‌ టీమ్‌ దానిపై తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా ఈ మధ్య ఎయిర్ ఇండియా, స్పైస్‌ జెట్‌ తదితర విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం ఆందోళన కలిగిస్తోంది. 

Also Read: శబరిమల బంగారం స్కామ్‌లో కీలక మలుపు.. హైకోర్టు కీలక ఆదేశాలు

పక్షి ఢీకొన్నప్పుడు ఏం జరుగుతుంది ?

సాధారణంగా పక్షి విమానం ఇంజిన్లను ఢీకొట్టినప్పుడు నష్టం జరుగుతుంది. దీనివల్ల ఇంజిన్‌లో వేగంగా తిరిగే బ్లేడ్‌లు దెబ్బతింటాయి. చివరికి ఇంజిన్ ఆగిపోవచ్చు అలాగే మంటలు కూడా చెలరేగవచ్చు. అయితే ఒక ఇంజిన్ ఆగిపోయినా కూడా విమానం మరొక ఇంజిన్‌తో సురక్షితంగా ప్రయాణం చేయగలదు. ఒకవేళ పక్షుల గుంపు వచ్చి రెండు ఇంజిన్లను ఢీకొంటే ప్రమాదం జరిగే అవకాశాలుంటాయి. 

Advertisment
తాజా కథనాలు