/rtv/media/media_files/2026/01/05/power-banks-can-no-more-be-used-on-flights-2026-01-05-10-32-32.jpg)
Power Banks Can No More Be Used On Flights
కేంద్ర పౌర విమానయాన శాఖ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల్లో వెళ్లే ప్రయాణికులు ఇకనుంచి పవర్‌బ్యాంక్‌లు(power banks ban) వాడటంపై నిషేధం విధించింది. విమాన భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని డీజీసీఏ అధికారులు వెల్లడించారు. దీనిపై అన్ని ఎయిర్‌పోర్టుల్లో మైక్‌ల ద్వార విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా విమానంలో పవర్‌బ్యాంకులు వాడుతూ కనిపిస్తే వాటిని సిబ్బంది వాడనీయకుండా చేస్తున్నారు.
Also Read: మహబూబ్‌నగర్‌లో భూకంపం.. భయంతో బయటకు పరుగులు తీసిన జనం
Power Banks Can No More Used On Flights
లిథియం అయాన్ బ్యాటరీలతో ఉండే పవర్‌బ్యాంక్‌లు దెబ్బతిన్నా లేదా వేడెక్కినా, పనిచేయకపోయినా అగ్ని ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. విమానం క్యాబిన్ లోపల చిన్న బ్యాటరీలు పేలినా కూడా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టంతో కూడుకున్న పని. రూల్స్ ప్రకారం పవర్‌బ్యాంకులను క్యాబిన్ లగేజీలోకి మాత్రమే పర్మిషన్ ఇస్తారు.
Also Read: 'ఘోస్ట్ సిమ్'లతో పాక్ హ్యాండ్లర్లతో నిందితుల చాటింగ్!
వీటిని విమానంలో ప్రయాణించేటప్పుడు వాడకూడదు. ముందుగానే ప్రయాణికులు తమ ఫోన్లు ఇతర పరికరాలను పూర్తిగా ఛార్జింగ్ చేసుకోని రావాలని సూచిస్తున్నారు. విమానం భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు సహకరించాలని విమానయాన శాఖ కోరింది.
Follow Us