/rtv/media/media_files/2025/12/05/indigo-offers-full-refunds-2025-12-05-16-27-26.jpg)
IndiGo offers full refunds
ఇండిగో విమాన సంస్థలో అంతరాయం ఏర్పడటంతో తాజాగా డీజీసీఏ వారాంతపు విశ్రాంతి నిబంధనను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో సర్వీసులు రద్దు, ఆలస్యం కావడంతో వేలాదిమంది ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇండిగో సంస్థ రీఫండ్‌పై కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 5-15 మధ్య ప్రయాణాల కోసం టికెట్లు బుక్ చేసుకొని.. ఈ అంతరాయాల వల్ల రద్దు లేదా రీషెడ్యూలింగ్ చేసుకునేవారికి పూర్తిగా రీఫండ్ ఇస్తామని పేర్కొంది.
— IndiGo (@IndiGo6E) December 5, 2025
కొన్ని రోజుల నుంచి కొనసాగుతున్న కఠిన పరిస్థితులను తాము అర్థం చేసుకోలగమని.. మీకు సహకరించేందుకు, కార్యకలాపాలు సాధారణ స్థికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. గత 19 ఏళ్ల నుంచి ప్రయాణికుల నుంచి తాము పొందిన నమ్మకాన్ని తిరిగి పొందేందుకు కృషి చేస్తున్నామని తెలిపింది.
Follow Us