/rtv/media/media_files/2025/12/05/indigo-ceo-pieter-elbers-2025-12-05-20-26-02.jpg)
IndiGo CEO Pieter Elbers
Indigo: ఇండిగో విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడటంతో శుక్రవారం వెయ్యికి పైగా సర్వీసులు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆ కంపెనీ సీఈవో పీటర్ ఎల్బర్స్ స్పందించారు. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని క్షమాపణలు చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు. శనివారం రద్దయ్యే విమానాల సంఖ్య.. వెయ్యి కన్నా తక్కువ ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డిసెంబర్ 10-15 మధ్య సాధారణ స్థితికి పరిస్థితులు వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
Also Read: జపాన్ ఈవెంట్ లో అదరకొట్టిన ప్రభాస్.. 'స్పిరిట్' లుక్ ఇదేనా..?
IndiGo CEO Speaks Out Amid Mass Flight Cancellations & Delays pic.twitter.com/jmrmFlFxIq
— Mojo Story (@themojostory) December 5, 2025
తాము తీసుకుంటున్న ముందస్తు చర్యలు సరిపోవడం లేదని గుర్తించామని.. అందుకే అన్ని వ్యవస్థలు, షెడ్యూల్‌ను రీబూట్ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రేపటి నుంచి పరిస్థితులు మెరుగుపడాలంటే ఈ చర్యలు తప్పనిసరని తెలిపారు. శనివారం వెయ్యి కన్నా తక్కువ సర్వీసులు రద్దవుతాయని అంచనా వేస్తున్నామని చెప్పారు. అలాగే డీజీసీఏ.. FDTL (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్)పై తీసుకున్న చర్యలు తమ సంస్థకు ఎంతగానో ఉపశమనం కలిగించాయని పేర్కొన్నారు.
Also Read: రూపాయి విలువ ఎందుకు పతమనయ్యింది .. ప్రధాన కారణాలు ఇవే !
ఇదిలాఉండగా ఇటీవల డీజీసీఏ FDTL నిబంధనలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. పైలట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతిని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచింది. నవంబర్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అలాగే రాత్రి సమయాల్లో ల్యాండింగ్స్‌ను పరిమితం చేసింది. ఈ నిర్ణయంతో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగోలో సిబ్బంది కొరత ఏర్పడింది. వందలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి.
శుక్రవారం ఒక్కరోజే వెయ్యి సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఇండిగో సంస్థ నిత్యం 2300 జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతోంది. విశ్రాంతి నిబంధనను DGCA ఎత్తివేయడంతో ఆ సంస్థకు భారీ ఊరట లభించింది. మరికొన్నిరోజుల్లోనే పరిస్థితులు సాధారణ స్థితికు చేరుకునే అవకాశాలున్నాయి.
Follow Us