/rtv/media/media_files/2025/10/26/bird-strike-is-affecting-flight-operations-2025-10-26-11-24-10.jpg)
Bird Strike is Affecting Flight Operations
Bird Strike is Affecting Flight Operations: పలు అంతర్జాతీయ విమాశ్రయాలకు పక్షుల బెడద ఎక్కువైంది. విమానాలు టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా పక్షులు వేగంగా వచ్చి ఢీ కొంటున్నాయి. దీంతో విమానాలు ప్రమాదాలకు గురికావడం, లేదా డ్యామెజ్ కావడం సర్వసాధారణమైంది. తాజాగా ఆకాశంలో ఎగురుతున్న ఒక విమానాన్ని ఏకంగా ఓ భారీ పక్షుల గుంపు ఢీకొట్టింది. ఈ ఘటన సౌదీలో చోటు చేసుకుంది. సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక బోయింగ్ 777-300 (ఫ్లైట్ నంబర్ SV340) గాలిలో ఉండగానే పక్షులు ఢీకొన్నాయి.
వివరాల ప్రకారం జెడ్డా విమానాశ్రయంలో బోయింగ్ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో పక్షల గుంపు విమానాన్ని ఢీకొట్టింది. దీంతో విమానం ముందు భాగం మొత్తం పక్షుల రక్తంతో నిండిపోయింది. పక్షులు బలంగా విమానాన్ని ఢీ కొట్టడంతో విమానం కొంత భాగం దెబ్బతింది. ఇది గమనించిన పైలట్లు అప్రమత్తమై విమానాన్ని అత్యంత సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ల్యాండింగ్ తర్వాత టెక్నికల్ సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. వారు గమనించిన సమయంలో విమానం ముందు భాగంలో పెద్ద ఎత్తున పక్షుల అవశేషాలు కనిపించాయి. అయితే ప్రమాదం సమయంలో పక్షులు ఇంజన్ లోకి వెళ్లి ఉంటే భారీ ప్రమాదం చోటు చేసుకునేదని నిపుణులు చెబుతున్నారు.
అయితే విమానశ్రయాల్లో పక్షుల బెడత ఇటీవల ఎక్కువైందన్న ఆరోపణలున్నాయి. విమానాశ్రయం చుట్టుపక్కల పారిశుద్ధ్యం లోపించడం ఈ సమస్యకు ప్రధాన కారణాలలో ఒకటిగా ఉంది. పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు, ఇతర దుకాణాలు పెద్ద ఎత్తున ఆహార వ్యర్థాలను బయట పారేస్తున్నాయి. మిగిలిన ఆహారం, మాంసపు ముక్కలు, వ్యర్థాలను తెచ్చి ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో పడేస్తున్నారని విమాన సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా పక్షులు, కుక్కలు, పందులు ఆ ప్రాంతంలో గుంపులు గుంపులుగా చేరుతున్నాయి. పక్షులు ఆహారం కోసం రన్‌వేపైన ఎగురుతుండటంతో పైలట్లకు పెద్ద తలనొప్పిగా మారింది.
Also Read : దీపావళి వేళ నల్గొండలో దారుణం.. ఇద్దరు పిల్లలను చంపిన తల్లి.. ఆ తర్వాత ఏం చేసిందంటే..?
Follow Us