/rtv/media/media_files/2025/11/15/shikha-garg-2025-11-15-15-20-59.jpg)
Who was Shikha Garg, UN worker killed in Boeing crash
2019లో జరిగిన ఓ విమాన ప్రమాదం జరిగింది. ఇందులో మరణించిన ఓ భారతీయ మృతురాలి కుటుంబానికి 35.85 మిలియన్ డాలర్లు (రూ.317 కోట్లు) చెల్లించాలని చికాగోలోని ఫెడరల్ కోర్టు ఆదేశించింది. ఆరేళ్ల పాటు జరిగిన ఈ న్యాయ పోరాటంలో ఆ కుటుంబానికి ఎట్టకేలకు విజయం దక్కింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. 2019, మార్చిలో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ విమానం (737 MAX) కుప్పకూలింది. ఈ ప్రమాదంలో భారతీయ పౌరురాలైన శిఖాగార్గ్ ప్రాణాలు కోల్పోయారు.
ఆ సమయంలో శిఖాగార్గ్ యూనైటెడ్ నేషన్స్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆ ఫ్లైట్‌లో ఆమె యూఎస్ ఎన్విరాన్‌మెంట్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొనేందుకు నైరోబీకి వెళ్తున్నారు. అయితే ఆ విమానం బోలె ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనకు ఐదు నెలల ముందే ఇండోనేషియాలో కూడా మరో బోయింగ్ విమాన ప్రమాదం జరిగింది. ఈ రెండు ప్రమాదాల్లో 340 మంది ప్రయాణికులు మృతి చెందారు.
Also Read: యూట్యూబ్‌లో 96 లక్షల మంది ఫాలోవర్లు.. ఎన్నికల్లో ఓడిన యూట్యూబర్
ఈ ఘటన తర్వాత బోయింగ్ సంస్థపై అనేక కేసులు నమోదయ్యారు. దీంతో ఆ సంస్థ మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చి చాలా కేసులను పరిష్కరించుకుంది. అలాగే భారత్‌కు చెందిన శిఖాగార్గ్ కుటుంబం కూడా కోర్టులో దావా వేసింది. ప్రమాదానికి గురైన ఆ విమానం మోడల్ డిజైన్‌లో లోపాలు ఉన్నట్లు పేర్కొంది. ప్రమాదాల గురించి ప్రయాణికులకు హెచ్చరించడంలో ఆ సంస్థ ఫెయిల్ అయ్యిందని ఆరోపించింది. ఇలానే మరిన్ని దావాలు బోయింగ్ సంస్థపై దాఖలయ్యాయి. ఇందులో శిఖాగార్గ్ వేసిన కుటుంబం దావాపై తీర్పు వచ్చింది. ఆమె కుటుంబానికి పరిహారంతో పాటు అన్ని ఖర్చులు కలిపి 35.85 మిలియన్ డాలర్లు (రూ.317 కోట్లు) చెల్లించాలని షికాగోలోని ఫెడరల్ జ్యూరీ తీర్పు వెలువరించింది.
Also Read: బీహార్ పాలిటికల్స్ లో బిగ్ ట్విస్ట్.. సీఎంగా చిరాగ్ పాశ్వాన్?
ఈ రెండు విమాన ప్రమాదాల అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 737 మ్యాక్స్ విమానాల సర్వీసులను నిలిపివేశారు. ఆ తర్వాత 2020 డిసెంబర్‌లో మళ్లీ ఈ కార్యకలాపాలు ప్రారంభించారు. ఇదిలాఉండగా ఈ ఏడాది జూన్‌లో అహ్మాదాబాద్ నుంచి యూకేకు వెళ్తున్న బోయింగ్ 787 విమానం కూడా టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ విషాద ఘటనలో ఆ విమానంలో ఉన్న 241 మంది మృతి చెందారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఆ విమానం మెడికల్ కాలేజీ భవనంపై కూలడంతో నేలపై ఉన్న మరో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
Follow Us