Afghan Boy: విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కొని.. ఢిల్లీకి అఫ్గాన్‌ బాలుడు

ఎయిర్‌పోర్ట్ సిబ్బందిని తప్పించుకొని 13 ఏళ్ల ఆఫ్ఘన్ బాలుడు కాబూల్ నుంచి ఢిల్లీకి విమాన‌లో వచ్చాడు. అది కూడా ల్యాండింగ్ గేర్ లోపల దాక్కుని. రెండు గంటల పాటు ల్యాండింగ్‌లో ప్రమాదకరంగా ప్రయాణించాడు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.

New Update
_Afghan boy

ఎయిర్‌పోర్ట్ సిబ్బందిని తప్పించుకొని 13 ఏళ్ల ఆఫ్ఘన్ బాలుడు కాబూల్ నుంచి ఢిల్లీ(Kabul-Delhi) కి విమాన‌లో వచ్చాడు. అది కూడా ల్యాండింగ్ గేర్ లోపల దాక్కుని. రెండు గంటల పాటు ల్యాండింగ్‌లో ప్రమాదకరంగా ప్రయాణించాడు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.

Also Read :  Pak Missile: దాల్‌ సరస్సులో పాక్‌ క్షిపణి శిథిలాలు.. ఎప్పటిదో తెలిస్తే షాక్!

Afghan Boy Escapes To Delhi

అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, కామ్ ఎయిర్ విమానం RQ-4401 కాబూల్ నుండి బయలుదేరి ఆదివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (IGI) విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత, సిబ్బంది ఆ విమానం వద్ద ఓ బాలుడు తిరుగుతుండటాన్ని గమనించారు. వెంటనే అప్రమత్తమైన విమానయాన సిబ్బంది ఆ బాలుడిని పట్టుకొని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బందికి అప్పగించారు.

Also Read :  జుబీన్ గార్గ్ మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం

అధికారులు బాలుడిని ప్రశ్నించగా, అతను కుందుజ్ నగరానికి చెందినవాడని చెప్పాడు. కాబూల్ విమానాశ్రయంలోకి చొరబడి విమానం వెనుక సెంట్రల్ ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్ లోపల దాక్కొని వచ్చానని చెప్పాడు. సరదా కోసమే ఇలా చేశానని, అందులో ఉన్న ప్రమాదం గురించి తనకు తెలియదని బాలుడు అన్నాడు.

విమానం ల్యాండింగ్ గేర్(Plane Landing Gear) కంపార్ట్‌మెంట్‌ను తనిఖీ చేసిన భద్రతా సిబ్బంది, ఓ చిన్న ఎరుపు రంగు స్పీకర్‌ను కనుగొన్నారు. ఈ సంఘటన తర్వాత, విమానం భద్రతను నిర్ధారించడానికి సమగ్ర తనిఖీలు నిర్వహించారు. బాలుడు మైనర్ కావడంతో అతనిపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. అధికారుల విచారణ తర్వాత, అదే రోజు ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు అతను వచ్చిన విమానంలోనే అతన్ని ఆఫ్ఘనిస్తాన్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన విమానాశ్రయ భద్రతలో ఉన్న లోపాలను మరోసారి బయటపెట్టింది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉండాలో ఈ సంఘటన గుర్తు చేసింది.

Advertisment
తాజా కథనాలు