Kukatpally Fire Accident : కూకట్‌ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం..గ్యాస్‌ సిలిండర్లు పేలి....

హైదరాబాద్ కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి  కూకట్‎పల్లి రాజీవ్ గాంధీ నగర్‎లోని ఓ గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్‎లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్ రీఫిలింగ్ చేస్తుండగా గ్యాస్ లీకై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

New Update
Fire Accident

Fire Accident

Kukatpally Fire Accident : హైదరాబాద్ కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం (జనవరి 13) రాత్రి  కూకట్‎పల్లి రాజీవ్ గాంధీ నగర్‎లోని ఓ గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్‎లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్ రీఫిలింగ్ చేస్తుండగా గ్యాస్ లీకై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.

గ్యాస్ సిలిండర్ల పేలుడు శబ్దాలు భారీగా వస్తున్నాయి. సుమారు 8 సిలిండర్లు పేలినట్లు సమాచారం. ముందస్తు జాగ్రత్తలో భాగంగా రీఫిల్లింగ్ స్టేషన్ సమీపంలోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తు్న్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. ప్రమాదం పై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు