Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 16 మంది మృతి

ఇండోనేసియాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సులవేసి ద్వీపంలోని నర్సింగ్‌ హోమ్‌లో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 16 మంది సజీవ దహనమవ్వడం కలకలం రేపుతోంది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
Fire at Indonesian retirement home kills 16

Fire at Indonesian retirement home kills 16

ఇండోనేసియా(indonasia) లో భారీ అగ్ని ప్రమాదం(fire accident) చోటుచేసుకుంది.  సులవేసి ద్వీపంలోని నర్సింగ్‌ హోమ్‌లో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 16 మంది సజీవ దహనమవ్వడం కలకలం రేపుతోంది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. దీంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు. 

Also Read: సిగరెట్ తాగేవారికి బిగ్ షాక్.. భారీగా పెరిగిపోనున్న ధరలు!

Fire At Indonesian Retirement Home

కానీ అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. మంటల్లో చిక్కుకుని 16 మంది సజీవ దహనమయ్యారు. నర్సింగ్‌ హోమ్‌లో ప్రమాదం జరిగిన సమయంలో వృద్ధులు అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. గదుల్లోనే వాళ్లు మంటల్లో కాలిపోయినట్లు తెలిపారు. తాము 12 మందిని సురక్షితంగా రక్షించినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అగ్నిప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతోంది. 

Also Read :  China-Taiwan: చైనా-తైవాన్‌ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు.. రంగంలోకి సైన్యం

Advertisment
తాజా కథనాలు