Pakistan: కరాచీలో భారీ అగ్ని ప్రమాదం..దాదాపు 100 మంది మృతి

కరాచీలో సద్దర్ ప్రాంతంలోని గుల్ షాపింగ్ ప్లాజాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇందులో మరణించిన వారి సంఖ్య దాదాపు వంద దాకా ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు.  దాదాపు 36 గంటల పాటూ మంటలు చెలరేగాయి. 

New Update
karachi

కరాచీలో షాపింగ్ మాల్ ప్రమాదం తీవ్ర విషాదానికి దారి తీసింది. సద్దర్ ప్రాంతంలోని గుల్ షాపింగ్ మాల్ లో చెలరేగిన మంటలు 61 మంది ప్రాణాలను బలి తీసుకుంది ఈ సంఖ్య వంద దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 30 మృతదేహాలను వెలికి తీశారు. 

ఇప్పటి వరకు 30 మంది మృతదేహాలు వెలికితీత..

పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలోని సదర్ ప్రాంతంలో ఉన్న గుల్ షాపింగ్ ప్లాజా బేస్‌మెంట్‌లో జనవరి 17వ తేదీ రాత్రి మంటలు చెలరేగాయి. ఈ ప్లాజా హోల్‌సేల్,  రిటైల్ మార్కెట్‌ లు చాలా ఉన్నాయి.  దీంతో మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. ఫ్లాజా అంతా అలుముకున్నాయి. అయితే ఈ మంటలు ఎలా అంటుకున్నాయి అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. దుబాయ్ క్రాకరీ అనే షాపులో మంటలు మొదలయ్యాయని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.  మరోవైపు భవనం అంతా పాకేసిన మంటలను ఆపడానికి దాదాపు 36 గంటలు సమయం పట్టింది. ఘటన జరిగిన సమయంలో చాలా మంది ప్లాజాలో ఉన్నారు. దుకాణదారులతో పాటూ వినియోగదారులు కూడా అగ్నిలో చిక్కుకుపోయారు. మంటల నుంచి తప్పించుకోవడానికి దుకాణాల షట్టర్లను మూసేశారని.. దాని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. 

అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు ఇప్పటి వరకు 30 మంది మృతదేహాలను వెలికి తీశారు. దుబాయ్క్రాకరీ నుంచే వీటన్నింటినీ బయటకు తీశారు. ఈ రోజు మరో మూడు మృతదేహాలను బయటకు తీశారు. వీటిలో చాలా మంది గుర్తు పట్టడం కష్టంగా మారింది. శరీరాలన్నీ గుర్తు పట్టడానికి వీల్లేకుండా కాలిపోయి ఉన్నాయి. మరోవైపు అక్కడి ప్రభుత్వం ఇప్పటికే 73 మంది తప్పిపోయిన వారి జాబితాను విడుదల చేసింది. వీరిలో 10 నుండి 69 సంవత్సరాల వయస్సు గల మహిళలు, పిల్లలు, పురుషులు ఉన్నారు. వారిలో 10 నుండి 18 సంవత్సరాల వయస్సు గల కనీసం 16 మంది బాలురు ఉన్నారు. వీరందరూ ప్లాజాలోని దుకాణాలలో లేదా షాపింగ్‌లో పనిచేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు