/rtv/media/media_files/2026/02/07/fire-accident-2026-02-07-09-51-36.jpg)
Fire Accident
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదానికి ముందు ప్రయాణికులను డ్రైవర్ అలెర్ట్ చేయగా అందరూ సురక్షితంగా బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక వివరాల్లోకి వెళ్తే 39 ప్రయాణికులతో వరుణ్ ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తోంది. అయితే కంచికచర్ల మండలం కీసర టోల్‌గేట్ వద్ద బస్సు వెనుకు ఇంజిన్‌లో ఒక్కసారిగా పొగలు వచ్చాయి.
మరో ప్రైవేట్ బస్సులో అగ్ని ప్రమాదం
— greatandhra (@greatandhranews) February 7, 2026
ఈరోజు NTR(D) నందిగామ వద్ద ప్రైవేట్ బస్సు దగ్ధమైంది, అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.#BusFire#Nandigamapic.twitter.com/3SGnhZBH7w
Also Read: భారత్ - అమెరికా కీలక ప్రకటన.. మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు
దీంతో అలెర్ట్ అయిన డ్రైవర్ బస్సును ఆపేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగా దిగిపోయారు. ఆ తర్వాత బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇటీవల కర్నూల్ జిల్లా చిన్నటేకూరు సమీపంలో కావేరి ట్రావెల్ బస్సు మంటల్లో కాలిపోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read: గ్రామ సర్పంచ్ కీలక నిర్ణయం.. మద్యం లేకుండా పెళ్లి జరిపితే రూ.51 వేల నజరానా
Follow Us