Special Trains : దసరా, దీపావళి పండుగలకు 1400 ప్రత్యేక రైళ్లు
దసరా , దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకొని 1400 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్యే తెలిపింది. ఈ రైళ్లు అక్టోబరు 1 నుంచి నవంబర్ 30 వరకు వేర్వేరు తేదీల్లో నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
రావణాసురుడి నుంచి నేర్చుకోవాల్సిన జీవితపాఠాలు ఇవే
రావణాసురుడి భూమిపై సంచరించిన అత్యంత జ్ఞానవంతుడు. స్త్రీలను గౌరవించడం ఆయన దగ్గర నుంచి నాయకత్వ లక్షణాలు నేర్చుకోవచ్చు.
ఈ దుస్తులు ధరించి.. నవరాత్రుల పూజ చేస్తే అంతా మంచే!
దేవీ నవరాత్రుల సందర్భంగా భక్తులు ఒక్కో రోజు ఒక్కో రంగు దుస్తులను ధరించి పూజలు నిర్వహిస్తారు. ఏడవ రోజు ఆశ్వయుజ సప్తమి నాడు రాయల్ బ్లూ కలర్లో ఉండే దుస్తులను ధరించి అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు.
ఐదవ రోజు.. మహా చండీ అలంకారణలో దుర్గమ్మ
విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజు మహా చండీ దేవీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఈరోజు పూజించడం వల్ల సమస్యలు అన్ని తొలగిపోవడంతో పాటు విద్య, కీర్తీ, సంపద లభిస్తాయని భక్తుల నమ్మకం.
నేడు గాయత్రీ అవతారంలో దుర్గమ్మ.. ప్రత్యేకత ఇదే!
విజయవాడ కనకదుర్గమ్మ దుర్గాదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా రెండో రోజు గాయత్రీ అవతారంలో దర్శనమిస్తుంది. విద్య, జ్ఞానం, ప్రశాంతతకు ప్రతీకగా ఈ రోజు దుర్గాదేవిని భక్తితో పూజిస్తారు.
దసరా దావత్.. రూ.100కే గొర్రెపొట్టేలు, మేకపోతు, ఫుల్ బాటిల్స్!
ఈ దసరాను విసూత్నంగా జరుపుకునేందుకు మంచిర్యాల జిల్లా బోయపల్లి గ్రామస్థులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. రూ.100కు కూపన్ కొని లక్కీడ్రాలో గొర్రె పొట్టేలు, మేకపోతు, నాటుకోడి, ఫుల్ బాటిల్ గెలుచుకోవాలంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. అక్టోబర్ 10న డ్రా తీయనున్నారు.
Dussehra Gift : తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. దసరాకు కొత్త కానుక!
తెలంగాణ మహిళలకు దసరా కానుకగా రేవంత్ సర్కార్ కొత్త కానుక ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. చీరలకు బదులు పండగ ఖర్చులకోసం రూ.500 అందించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఈ వారంలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
TSRTC: దసరా పండుగ ఎఫెక్ట్.. తెలంగాణ ఆర్టీసీకీ కాసుల వర్షం..
తెలంగాణలో దసరా, బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఆర్టీసీ సంస్థకు భారీగా వసూళ్లు వచ్చాయి. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా సర్వీసులు నడిపించడం వల్ల ఆదాయం గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు. దాదాపు 25 కోట్ల రూపాయల వరకు అదనపు ఆదాయం వచ్చినట్లు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 13 నుంచి 24 వరకు దాదాపు 11 రోజుల పాటు 5,500 ప్రత్యేక బస్సులు నడిపించడంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం వచ్చింది.