రావణాసురుడి నుంచి నేర్చుకోవాల్సిన జీవితపాఠాలు ఇవే

రావణాసురుడి భూమిపై సంచరించిన అత్యంత జ్ఞానవంతుడు. స్త్రీలను గౌరవించడం ఆయన దగ్గర నుంచి నాయకత్వ లక్షణాలు నేర్చుకోవచ్చు.

New Update
Ravanasura - Dussehra

దసరా రోజు రావణాసురుడి దిష్టిబొమ్మలను దహనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ప్రజలు ఇలా చేస్తుంటారు. రామాయణం-రావణ విరోధితో సంబంధం లేకుండా రావణాసురుడి నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని జీవిత పాఠాల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. రావణాసురుడిని రావణ బ్రహ్మ అని కూడా అంటారు. పరమశివుడిని ప్రియ భక్తుడు ఈయన. చెడు విషయం పక్కన పెడితే ఆయనలో ఉన్న కొన్ని గొప్ప లక్షణాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి.

విద్య:

రావణుడు భూమిపై సంచరించిన అత్యంత జ్ఞానవంతుడు. రావణుడు నాలుగు వేదాలలో ప్రావీణ్యం కలవాడు. అన్ని శాస్త్రాలు, వేదాల్లో ఎంతో పాండిత్యం పొందాడని చెబుతారు. అంతేకాకుండా జ్యోతిష్యం, వైద్య రంగాలలో అపారమైన జ్ఞానం రావణాసుడి సొంతం. రావణ సంహిత, అర్క ప్రకాశంగా పిలుస్తారు. 

కుటుంబం పట్ల ప్రేమ:

సీతను అపహరించడంలో రావణుడు తప్పు చేసినా అది తన సోదరి గౌరవం కోసమే. శూర్పణఖను అవమానించారని రాముడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి రావణుడు సీతను అపహరించాడు.

స్త్రీలను గౌరవించడం:

ప్రతి స్త్రీని తప్పుగా చూడటం మానేసి, ఆమె భావాలను గౌరవించాలి. హిందూ పురాణాల ప్రకారం రంభ కైలాసాన్ని సందర్శించినప్పుడు రాక్షస రాజు రావణుడు ఆమెను చూశాడు. అతను ఆమె అందానికి ముగ్ధుడై తన కోరిక తీర్చుకోవడానికి ఆమెను కోరాడు. ఆ తర్వాత తన అంగీకారం లేకుండా స్త్రీని తాకితే చనిపోతానని చెప్పింది. దాంతో ఆమెను గౌరవించి అప్పటి నుంచి స్త్రీలపై గౌరవంగా ఉన్నాడు. 

నాయకత్వం:

రావణుడు చాలా సమర్థవంతమైన నాయకుడు, పాలకుడు. ఆయన పాలనలో లంకను సోనేకి లంక అని పిలిచేవారు. రాక్షస రాజు సుమాలి సైన్యానికి నాయకత్వం వహించాడు. లంకలో బంగారు పాలన అందించాడు. ప్రజలను ప్రేమగా చూసుకునేవాడు.

అహం ఓడిపోతుందని గుర్తించాలి:

రావణుడి పరాజయానికి ప్రధాన కారణం అతని అహంకారమే. ఒకసారి రావణుడు తన అహంకారం, గర్వం కారణంగా అతనికి సలహా ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు వి+భీషణుడి మాటలను పట్టించుకోలేదు. రావణుడి అహంభావం ప్రతీకారం కోసం సీతను అపహరించేలా చేసింది. చివరికి రాముడు రావణుని చంపాడు. అందుకే అహంకారం ఉంటే ఎంతటివారైనా పతనం కావాల్సిందే అని మనం గుర్తుంచుకోవాలి. రహస్యాలను బహిర్గతం చేయకండి:

రహస్యం ఎప్పుడూ రహస్యంగానే ఉండాలి. ఇది మీ సన్నిహితులకు, ప్రియమైన వారికి కూడా బహిర్గతం చేయకూడదు. లంకాపతి రావణుడు తన బలహీనతను తన నిజమైన సోదరుడు విభీషణునితో పంచుకున్నాడు, అది చివరికి అతనిపైకే వచ్చింది.

Also Read :  జాతకంలో పెళ్లి రేఖలు లేవా? ఇందుకే టాటా వివాహం చేసుకోలేదా?

Advertisment
Advertisment
తాజా కథనాలు