ఐదవ రోజు.. మహా చండీ అలంకారణలో దుర్గమ్మ

విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజు మహా చండీ దేవీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఈరోజు పూజించడం వల్ల సమస్యలు అన్ని తొలగిపోవడంతో పాటు విద్య, కీర్తీ, సంపద లభిస్తాయని భక్తుల నమ్మకం.

New Update
durgamma

దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వేడుకలు కొనసాగుతున్నాయి. అమ్మవారు రోజుకి ఒక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నవరాత్రుల్లో ఐదో రోజు సందర్భంగా అమ్మవారు మహా చండీ దేవీగా భక్తులకు దర్శనమిస్తున్నారు. చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కలిసి ఉంటారని పెద్దలు చెబుతుంటారు.

ఇది కూడా చూడండి: ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్.. ఎక్కడుందో తెలుసా?

విద్య, కీర్తీ, సంపద లభిస్తాయని..

ఈ రోజు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే విద్య, కీర్తీ, సంపద లభిస్తాయని భక్తుల నమ్మకం. అలాగే కోరిన ఏ కోరికలు అయిన అమ్మవారు నెరవేరుస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈరోజు మహా చండి అమ్మవారికి కదంబం, చక్కెర పొంగలి, పులిహోర, లడ్డూ, రవ్వకేసరి, కట్టె పొంగలి వంటకాలను నైవేద్యంగా చేసి సమర్పిస్తారు. అలాగే ఎరుపు రంగు వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించడంతో పాటు ఎర్రటి పూలతో పూజిస్తే మంచిదని భక్తుల నమ్మకం.

ఇది కూడా చూడండి: Canada: కెనడాలో వెయిటర్‌ ఉద్యోగం కోసం ఎగబడుతున్న వేల మంది భారతీయులు!

అమ్మవారిని ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తూ.. చండీ ధ్యానం, లలితా సహస్రనామ స్తోత్రం, ఖడ్గమాల పఠించాలి. ఇలా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రతి పనిలో విజయం సాధిస్తారని భక్తులు నమ్ముతారు. దుర్గమ్మ అలంకరణను చూడటానికి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తుంటారు. నవరాత్రులు ప్రారంభం అయినప్పటి నుంచి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. 

ఇది కూడా చూడండి: Israel:ఊచకోతకు ఏడాది.. 365 రోజుల వినాశనం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

Advertisment
Advertisment
తాజా కథనాలు