TSRTC: దసరా పండుగ ఎఫెక్ట్.. తెలంగాణ ఆర్టీసీకీ కాసుల వర్షం..
తెలంగాణలో దసరా, బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఆర్టీసీ సంస్థకు భారీగా వసూళ్లు వచ్చాయి. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా సర్వీసులు నడిపించడం వల్ల ఆదాయం గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు. దాదాపు 25 కోట్ల రూపాయల వరకు అదనపు ఆదాయం వచ్చినట్లు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 13 నుంచి 24 వరకు దాదాపు 11 రోజుల పాటు 5,500 ప్రత్యేక బస్సులు నడిపించడంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం వచ్చింది.