నేడు గాయత్రీ అవతారంలో దుర్గమ్మ.. ప్రత్యేకత ఇదే!

విజయవాడ కనకదుర్గమ్మ దుర్గాదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా రెండో రోజు గాయత్రీ అవతారంలో దర్శనమిస్తుంది. విద్య, జ్ఞానం, ప్రశాంతతకు ప్రతీకగా ఈ రోజు దుర్గాదేవిని భక్తితో పూజిస్తారు.

New Update
vijaywada

దేశంలో దుర్గాదేవి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా నవరాత్రులను ఘనంగా జరుపుకుంటారు. హిందూ సంప్రదాయ పండుగల్లో నవరాత్రులకు ప్రత్యేకత ఉంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమైన దుర్గాదేవి నవరాత్రులు ఆశ్వయుజ శుద్ధ దశమికి ముగుస్తాయి. మొత్తం తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తారు.

ఇది కూడా చూడండి: వరుసగా నాలుగో రోజు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

ఘనంగా ఉత్సవాలు..

ఈ ఏడాది దుర్గాదేవి నవరాత్రులు అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం తొమ్మిది రోజుల పాటు జరుపుకునే పూజలో దుర్గాదేవి ఒక్కో రోజు ఒక్కో అవతారంతో దర్శనమిస్తుంది. తొమ్మిది రోజుల పాటు జరిగే దుర్గాదేవి నవరాత్రుల వేడుకను విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. ప్రతీ ఏడాది ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. ఈ సమయంలో కనకదుర్గమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. 

725d46b8-8e25-4326-8d00-6ec899748425

ఇది కూడా చూడండి: Vijayawada: నవరాత్రుల స్పెషల్‌...భక్తుల కోసం ప్రత్యేక యాప్‌!

నవరాత్రుల్లో మొదటి రోజు శుద్ధ పాడ్యమి నాడు శ్రీ బాలా త్రిపుర సుందరిగా దుర్గాదేవిగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనమిచ్చింది. రెండో రోజు అనగా నేడు గాయత్రీ అవతారంలో దుర్గమ్మ కనిపిస్తుంది. విద్య, జ్ఞానం, ప్రశాంతతకు ప్రతీకగా ఈ రోజు దుర్గాదేవిని పూజిస్తారు. నవరాత్రుల సందర్భంగా ఈ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు, కుంకుమ అర్చన నిర్వహిస్తారు. విజయవాడ కనకదుర్గమ్మను నవరాత్రుల్లో భక్తితో పూజించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.

ఇది కూడా చూడండి: Paracetamol: పారాసిట్మాల్‌ ను అధికంగా వాడితే ఇక అంతే సంగతలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు