USA: ఫిబ్రవరిలో అమెరికాకు భారత ప్రధాని
వచ్చే నెల ఫిబ్రవరిలో భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వచ్చే అవకాశాలున్నాయని అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. నిన్న ఇరు దేశాధినేతలూ ఫోన్ లో మాట్లాడుకున్నాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వచ్చే నెల ఫిబ్రవరిలో భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వచ్చే అవకాశాలున్నాయని అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. నిన్న ఇరు దేశాధినేతలూ ఫోన్ లో మాట్లాడుకున్నాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అమెరికాకు వలస వచ్చిన వారి పిల్లలకు జన్మత: వచ్చే పౌరసత్వ హక్కును ట్రంప్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు సియాటెల్ కోర్టు జడ్డి జాన్ కఫెనర్ ప్రకటించారు. ఆ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
హెచ్ 1 బీ వీసాల మీద జరిగిన డిబేట్ లో కొత్త అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్నారు. ఈ వీసాలపై రిపబ్లికన్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో సమర్ధవంతులైన ప్రజలే అమెరికాకు రావాలని ట్రంప్ అన్నారు.
డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. పాలనలో మరింత దూకుడు పెంచారు ట్రంప్. తాజాగా ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ సిబ్బంది అందరికీ లేఆఫ్‌లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వారందరినీ సెలవుపై వెళ్లిపోవాలని ఉత్తర్వులు జారీ చేశారు.