Donald Trump: పబ్లిక్‌లోనే గొడవపడ్డ ట్రంప్-మెలానియా.. నెట్టింట వీడియో వైరల్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన సతీమణి మెలానియాకు హెలికాప్టర్‌లో గొడవ జరిగినట్లు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్లేటప్పుడు, వారు ఎక్కిన ఎస్కలేటర్ ఆగిపోవడంతో మాట్లాడుకున్నట్లు లిప్ రీడర్ క్లారిటీ ఇచ్చారు. 

New Update
Donald trump

Donald trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన సతీమణి మెలానియా మధ్య గొడవ జరిగినట్లు ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ట్రంప్ తన సతీమణితో ఆవేశంగా చేయి చూపిస్తూ మాట్లాడుతున్నారు. ట్రంప్ ఒకరితో ఒకరు ఆవేశంగా మాట్లాడుకుంటున్న ఒక వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన వారు వీరిద్దరికి ఏమైంది? ఎందుకు గొడవపడ్డారని చర్చించుకుంటున్నారు. అసలు ఏం జరిగిందంటే?

ఇది కూడా చూడండి: H-1B visa: ట్రంప్ కు ఎదురుదెబ్బ..హెచ్ 1బీ వీసా ఫీజుల పెంపుపై కోర్టుకు వెళ్ళనున్న ఛాంబర్ ఆఫ్ కామర్స్

ట్రంప్ దంపతులు ఇటీవల ఐక్యరాజ్యసమితి 80వ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సమావేశాలు ముగిసిన తర్వాత వారు మెరైన్ వన్ హెలికాప్టర్‌లో తిరిగి వెళ్తున్నారు. ఆ సమయంలోనే వారు మాట్లాడుకుంటుండగా, హెలికాప్టర్ బయట నుండి ఎవరో వీడియో తీశారు. అందులో ట్రంప్, మెలానియా వైపు వేలు చూపిస్తూ కోపంగా మాట్లాడటం కనిపించింది. దీంతో వీరిద్దరూ గొడవ పడ్డారని వీడియో తెగ వైరల్ అయ్యింది. కానీ నిజానికి వారు గొడవపడ లేదని తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్లేటప్పుడు, వారు ఎక్కిన ఎస్కలేటర్ ఆగిపోయింది. దీని కోసమే వారు హెలికాప్టర్‌లో మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై లిప్ రీడర్ కూడా క్లారిటీ ఇచ్చారు. 

ట్రంప్ మెలానియా మధ్య జరిగిన కన్వర్జేషన్

వాళ్లు నిన్ను బాధ పెట్టడానికి ప్రయత్నించారు.. నేను వారిని క్షమించలేనని ట్రంప్ అన్నారు. అప్పుడు మెలానియా ఇది మనం చేయలేం. సురక్షితగా ఉండాలి. ప్రస్తుతం మీరు సేఫ్‌గా లేరని అన్నారు. అప్పుడు ట్రంప్ వాళ్లు అయిపోయారు.. వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారని లిప్ రీడర్ తెలిపారు. ఎస్కలేటర్ ఆగిపోవడం పట్ల అధ్యక్షుడు చాలా అసహనానికి గురయ్యారని దాని కోసమే చర్చించినట్లు తెలుస్తోంది. వ్యక్తిగతంగా అయితే వారిద్దరూ గొడవ పడటం లేదని స్పష్టం చేశారు. ఈ చర్చ జరిగిన తర్వాత వీరిద్దరూ హెలికాప్టర్ దిగి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్లిపోయారు.

ఇది కూడా చూడండి: Elon Musk: ట్రంప్ తర్వాత ఎలాన్ మస్క్...ఎపిస్టీన్ ఫైల్స్ లో బిలయనీర్ పేరు

Advertisment
తాజా కథనాలు