/rtv/media/media_files/2025/01/31/2uoCwwor1Z9GFQ62NhzK.jpg)
Donald Trump
BIG BREAKING: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ కు మరో బిగ్ షాక్ ఇచ్చారు. విదేశీ సినిమాలపై 100 శాతం ట్యాక్స్ ప్రకటించారు. ఈ ప్రభావం భారతీయ సినిమాలపై పడనుంది. ముఖ్యంగా తెలుగు సినిమాలపై అధిక ప్రభావం పడనుంది. తెలుగు సినిమాలకు వందశాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
#NewsFlash | US President Donald Trump imposes 100% tariffs on all movies made outside the United States#Trump#DonaldTrumppic.twitter.com/ar7tWSHHN4
— CNBC-TV18 (@CNBCTV18Live) September 29, 2025
దీంతో అమెరికాలో విడుదల కానున్న ఇతర దేశాల సినిమాలపై 100 శాతం ట్యాక్స్ విధించనున్నారు. ఈ ప్రభావం తెలుగు సినిమాలకు ఎక్కువగా పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో అమెరికాలో నిర్మించే సినిమాలకు మినహాయింపు ఇచ్చారు. విదేశీ సినిమాలతో అమెరికా బిజినెస్ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఈ ట్యాక్స్ విధించినట్లు తెలిపారు. అయితే ఈ సుంకాలు ఎప్పటినుంచి అమల్లోకి వస్తాయనే విషయాన్ని మాత్రం వెళ్లడించలేదు.
‘‘అమెరికా వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై నూరు శాతం సుంకం విధించబోతున్నాం. మా సినిమా నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు దొంగిలించాయి. పిల్లాడి నుంచి మిఠాయిని దొంగిలించినట్లు మా వద్ద నుంచి లాక్కున్నాయి. ముఖ్యంగా కాలిఫోర్నియాకు ఉన్న బలహీన, అసమర్థత గవర్నర్ వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. దీర్ఘకాలికంగా ఉన్న ఈ సమస్యను నూరు శాతం సుంకాలు విధించడం ద్వారా పరిష్కరించి అమెరికాను మరోసారి అగ్రస్థానంలో నిలుపుతాను’’ అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ ఖాతాలో పేర్కొనడం గమనార్హం.