Donald Trump Escalator Row : ట్రంప్‌, మెలానియా ఎక్కగానే ఆగిన ఎస్కలేటర్‌.. విచారణకు ఆదేశించిన వైట్ హౌజ్

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌ ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరైన సందర్భంగా వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఆయన ఎక్కిన ఎస్కలేటర్‌ కూడా ఆగిపోవడం చర్చనీయంశమైంది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

New Update
Donald Trump Escalator Row

Donald Trump Escalator Row

Donald Trump Escalator Row : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డోనాల్డ్ ట్రంప్‌ తీసుకుంటున్న పలు చర్యలు ప్రపంచ వ్యాప్తంగా వివాదస్పదమవుతున్న సంగతి తెలిసిందే, అదే క్రమంలో ఆయన ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరైన సందర్భంగా వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఆయన ఎక్కిన ఎస్కలేటర్‌ కూడా ఆగిపోవడం చర్చనీయంశమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలే అన్నట్లు ఆయనకు వరుస చేదు అనుభవాలు ఎదురయ్యాయి. సభలో ఆయన మాట్లాడుతుండగా టెలిప్రాంప్టర్‌ పనిచేయని సంగతి తెలిసిందే. అంతకుముందు సమావేశానికి వస్తుండగా ట్రంప్‌ ఎక్కిన ఎస్కలేటర్‌ కూడా ఆగిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారటంతో దీనిపై వైట్‌ హౌజ్‌ చర్యలకు ఉపక్రమించింది.

ఐక్యరాజ్యసమితి  సర్వప్రతినిధి సభ సమావేశాలకు హాజరయ్యేందుకు అమెరికా ప్రథమ మహిళ, భార్య మెలానియాతో కలిసి ట్రంప్ (Donald Trump) హాజరయ్యారు. సమావేశానికి సంబంధించిన వేదిక వద్దకు వెళ్లేందుకు వీరిద్దరూ అక్కడి ఎస్కలేటర్‌ ఎక్కారు. అయితే, ఏం జరిగిందో తెలియదు గానీ.. వారిద్దరూ ఎక్కిన  వెంటనే ఎస్కలేటర్‌ పనిచేయకుండా ఆగిపోయింది. అప్పటివరకు బాగపనిచేసిన ఎస్కలేటర్‌ ట్రంప్‌, మెలానియా దంపతులు ఒకింత అయోమయానికి గురయ్యారు. ఆ తర్వాత ఆగిన ఎస్కలేటర్‌పై మెట్లు  సమావేశానికి ఎక్కి వెళ్లిపోయారు.

అయితే ఈ విషయాన్ని ఆయన ఐరాస సభలో ప్రసంగిస్తున్న సమయంలో  ఈ విషయాలను ప్రస్తావించారు. ‘‘ఈ రోజు ఐరాసలో నాకు రెండు విషయాలు ప్రతికూలంగా జరిగాయి. ఒకటి చెత్త ఎస్కలేటర్‌.. రెండోది పనిచేయని టెలిప్రాంప్టర్‌’’ అని తన ప్రసంగాన్ని ప్రారంభించడం గమనార్హం. అయితే, ఈ ఘటనపై వైట్‌హౌస్‌ తీవ్రంగా స్పందించింది.  ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ అంశాలను సీరియస్ గా తీసుకున్న వైట్‌ హౌజ్‌ దీనిపై దర్యాప్తునకు ఆదేశించింది. ‘‘అధ్యక్షుడు, ప్రథమ మహిళ ఎక్కిన వెంటనే ఎస్కలేటర్‌ను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆపి ఉంటే గనుక.. వారిని తక్షణమే విధుల నుంచి తప్పించి దర్యాప్తు జరిపించాలి’’ అని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ ఎక్స్‌లో స్పష్టంగా ఆదేశించారు.

కాగా దీనిపై ఐక్యరాజ్య సమితి అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ కూడా స్పందించారు. ‘‘ఎస్కలేటర్‌ పైన ఉన్న బిల్ట్‌ఇన్‌ సేఫ్టీ మెకానిజం బటన్‌ను నొక్కడం వల్లే అది ఆగిపోయినట్లు సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ గుర్తించిందన్నారు. ట్రంప్‌ అక్కడికి రావడానికి కొన్ని నిమిషాల ముందు ఆయన వీడియోగ్రాఫర్‌ ఎస్కలేటర్‌ పైకి వెళ్లారు. అక్కడినుంచి వారి వీడియో తీద్దామనుకున్నారు. ఆ సమయంలో అనుకోకుండా ఈ సేఫ్టీ ఫంక్షన్‌ బటన్‌ను నొక్కి ఉండి ఉంటారు’’ అని అభిప్రాయపడ్డారు.

ఇది కూడా  చూడండి: Weekend OTT List: వీకెండ్ స్పెషల్.. ఓటీటీ మూవీస్ లిస్ట్ ఇదే..!

Advertisment
తాజా కథనాలు