DGCA: ఎయిర్‌పోర్టులో వీల్‌చైర్ లేక వృద్ధుడు మృతి.. ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా
వీల్‌చైర్ సదుపాయం లేక ఇటీవల ముంబయి ఎయిర్‌పోర్టులో ఓ వృద్ధుడు కుప్పకూలి మృతి చెందిన సంఘటన తెలిసిందే. దీనిపై తీవ్రంగా పరిగణించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA).. ఎయిర్ఇండియాకు ఏకంగా రూ.30 లక్షల జరిమానా విధించింది.