ఇండిగో సంక్షోభానికి ఈ 5 కారణాలే.. కేంద్రానికి సంచలన లేఖ!

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు పెద్ద ఎత్తున రద్దు కావడం, ఆలస్యం కావడం వల్ల తలెత్తిన సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ఇండిగో వివరణ ఇచ్చింది. దీనికి కారణం లేఖలో 5 ప్రధాన అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

New Update
indigo

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు పెద్ద ఎత్తున రద్దు కావడం, ఆలస్యం కావడం వల్ల తలెత్తిన సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA)కు ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది. ఈ భారీ అంతరాయానికి గల కారణాలను వివరిస్తూ ఇండిగో తమ లేఖలో ఐదు ప్రధాన అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

సంక్షోభానికి ఇండిగో తెలిపిన 5 కారణాలు:

  • సవరించిన FDTL నిబంధనలు: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అమలులోకి తెచ్చిన కొత్త 'ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్' (FDTL) నిబంధనలు. పైలట్‌లు, సిబ్బంది విశ్రాంతి సమయాన్ని పెంచడం వల్ల రోస్టర్ నిర్వహణలో పెద్ద సవాలు ఎదురైందని ఇండిగో తెలిపింది.

  • చిన్నపాటి సాంకేతిక లోపాలు: సాధారణంగా తలెత్తే చిన్నపాటి టెక్నికల్ సమస్యలు.

  • ప్రతికూల వాతావరణం: ముఖ్యంగా శీతాకాలంలో పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు మరియు ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడింది.

  • శీతాకాల షెడ్యూల్ మార్పులు: వింటర్ షెడ్యూల్‌ను అమలు చేసే క్రమంలో చేయాల్సిన షెడ్యూల్ సర్దుబాట్లు.

  • విమానాశ్రయ రద్దీ : విమానయాన వ్యవస్థలో పెరిగిన రద్దీ మరియు విమానాశ్రయాలలో కార్యకలాపాల ఒత్తిడి.

ఇండిగో ఈ సమస్యలన్నింటినీ "అనుకోని, ఊహించని పరిస్థితులుగా పేర్కొంది. ఈ సంక్షోభం తలెత్తడానికి ఒకే ఒక కారణాన్ని గుర్తించడం ప్రస్తుతానికి సాధ్యం కాదని, పూర్తి స్థాయిలో 'రూట్ కాజ్ అనాలసిస్' (RCA) పూర్తి చేయడానికి మరింత సమయం పడుతుందని ఇండిగో కేంద్రానికి తెలిపింది.

Advertisment
తాజా కథనాలు