/rtv/media/media_files/2025/05/22/o48cOgxaOnev3BEAu0YN.jpg)
Pakistan to extend closure of its airspace for Indian flights by another month
విమాన టికెట్ల బుకింగ్, రిఫండ్‌లకు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పలు మార్పులను ప్రతిపాదించింది. టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల్లోగా, ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా టికెట్ రద్దు చేసుకోవడం లేదా మార్పులు చేసుకునేందుకు వీలుగా లుక్- ఇన్ విండో తీసుకురావాలని డీజీసీఏ యోచన చేస్తోంది. ఈ ప్రతిపాదనల మరికొన్ని అంశాలనూ చేర్చింది. వీటిపై ఈనెల 30లోగా స్పందనలు తెలియజేయాల్సిందిగా సంబంధిత వర్గాలను డీజీసీఏ కోరింది. దాని తరువాత ఫైనల్ రిజల్ట్ ను ప్రకటించనుంది.
డీజీసీఏ ప్రతిపాదనలు ఇవే..
టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల పాటు ‘లుక్- ఇన్ ఆప్షన్’ను విమానయాన సంస్థలు ఇవ్వాలి. ఈలోపు ప్రయాణికులు ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా టికెట్‌ను రద్దు లేదా మార్పులు చేసుకోవచ్చు. అయితే కొత్త తేదీలో ఉన్న టికెట్ ధరలో మార్పులుంటే మాత్రం వాటికి తగ్గట్టు చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే కంపెనీ వెబ్‌సైట్ ద్వారా నేరుగా టికెట్ బుక్ చేసుకుంటే.. దేశీయ విమానాల్లో ప్రయాణానికి 5 రోజులు, అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణానికి 15 రోజుల్లోపు ఈ లుక్-ఇన్ విండో సౌకర్యం ఉండదు. టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల తర్వాత కనుక, ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే క్యాన్సిలేషన్ ఛార్జీలను ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది.
టికెట్ బుక్ చేసుకున్న 24 గంటల్లోగా ప్రయాణికుల పేరు మార్పులకు డబ్బులు వసూలు చేయకూడదు.
క్రెడిట్ కార్డు చెల్లింపుల ద్వారా టికెట్ బుక్ చేసుకుని..తర్వాత రద్దు చేసుకుంటే.. 7 రోజుల్లోగారిఫండ్ మొత్తాన్ని క్రెడిట్ కార్డుదారుడి ఖాతాలో జమ చేయాలి. అదే డబ్బులు చెల్లించి టికెట్ కొనుగోలు చేస్తే కంపెనీ కార్యాలయం లేదా టికెట్ కొనుగోలు చేసిన దగ్గర తక్షణం రిఫండ్ ఇవ్వాలి.
ట్రావెల్ ఏజెంట్/ పోర్టల్ ద్వారా టికెట్ కొనుగోలు చేస్తే రిఫండ్ ప్రక్రియను విమానయాన సంస్థలు 21 పనిదినాల్లోగా పూర్తి చేయాలి.
టికెట్ల రద్దు లేదా వినియోగించని పక్షంలో యూడీఎఫ్, ఏడీఎఫ్/పీఎస్‌ఎఫ్ వంటి పన్నులు, ఫీజులను పూర్తిగా వెనక్కి ఇవ్వాలి.
బుకింగ్ సమయంలో క్యాన్సిలేషన్ ఛార్జీలను స్పష్టంగా మెన్షన్ చేయాలి.
బేసిక్ ఛార్జీ, ఇంధన సర్‌ఛార్జీకంటే అధికంగా క్యాన్సిలేషన్ ఛార్జీలను విమానయాన సంస్థలు వసూలు చేయరాదు.
రిఫండ్ ప్రాసెస్ చేయడానికి ఎటువంటి అదనపు ఛార్జీలను విధించరాదు.
భారత నియమాలను పాటిస్తూనే సొంత దేశంలో రిఫండ్ నిబంధనలను విదేశీ విమానయాన సంస్థలు అమలు చేయాలి.
వైద్య అత్యవసర పరిస్థితుల కారణంగా ప్రయాణికులు టికెట్‌ను రద్దు చేసుకుంటే రిఫండ్ లేదా క్రెడిట్ షెల్‌ను కంపెనీలు అందించాలి.
Also Read: Flight Accident: అమెరికాలోని కెంటకీలో పేలిన విమానం..ముగ్గురు మృతి, 11 మంది గాయాలు
Follow Us