IndiGo Crisis: ఇండిగోపై యాక్షన్ స్టార్ట్.. తొలి వేటు వేసిన మోదీ సర్కార్!

ఇండిగో సంస్థకు కేంద్రం షాకిచ్చింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఈ సంస్థకు ఉన్న స్లాట్లలో అయిదు శాతం కోత విధించింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
DGCA slashes IndiGo's flight schedule by 5% amid disruptions

DGCA slashes IndiGo's flight schedule by 5% amid disruptions

ఇటీవల ఇండిగో విమానయాన సంస్థలో అంతరాయం నెలకొనడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దు కావడంతో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా ఇండిగో సంస్థకు కేంద్రం షాకిచ్చింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఈ సంస్థకు ఉన్న స్లాట్లలో అయిదు శాతం కోత విధించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల ఆ కంపెనీ నడిపే విమానాల సంఖ్యలో సుమారు 110 వరకు తగ్గనున్నాయి. 

స్లాట్లు అంటే 

విమానాశ్రయాల్లో ఇండిలో లేదా ఇతర సంస్థలు ఎన్నిసార్లు టేకాఫ్‌/ల్యాండింగ్‌లు జరిపేందుకు ఉన్న పర్మిషన్ల సంఖ్యనే స్లాట్లు అని పిలుస్తారు. ఇంకా వివరంగా చెప్పాలంటే హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో 24 గంటల టైమ్‌లో ఇండిగోకు వంద స్లాట్లు ఉన్నాయనుకుంటే.. ఆ సంస్థ ఈ 24 గంటల సమయంలో 50 చోట్లకు తమ సర్వీసులు అందించవచ్చు. అయితే డీజీసీఏ జారీ చేసిన తాజా ఉత్తర్వులు వల్ల ఇండిగోకు ఐదు శాతం స్లాట్లు తగ్గాయి. అంటే ఇప్పుడు ఇండిగో హైదరాబాద్‌ నుంచి 47 చోట్లకు మాత్రమే తమ సర్వీసులు నడపగలదు.  

Also Read: బర్త్ డే నాడు సోనియా గాంధీకి బిగ్ షాక్.. మళ్లీ తెరపైకి పౌరసత్వం కేసు.. కోర్టు కీలక ఆదేశాలు!

తగ్గించిన స్లాట్లను ఏం చేస్తారు

DGCA ఉత్తర్వుల ప్రకారం ఇండిగోకు తగ్గిన స్లాట్లను ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, ఆకాశ లాంటి ఇతర విమానయాన సంస్థలకు కేటాయిస్తారు. అయితే ఇండిగోకు స్లాట్లు తగ్గడంతో మంగళవారం చెన్నైలో 41 విమానాలు రద్దు చేసింది. వీటిలో 23 ల్యాండింగ్స్ ఉన్నాయి. అలాగే 18 టేకాఫ్‌లు ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, తిరువనంతపురంలో కూడా కొన్ని సర్వీసులను రద్దు చేస్తున్నారు. స్లాట్లు తగ్గించడం వల్ల వైమానిక సంస్థల షెడ్యూల్స్‌ నిర్వహణ మెరుగుపడనుందని DGCA అధికారి తెలిపారు. ప్రయాణీకులకు కలిసిన అసౌక్యం కూడా తగ్గుతుందని చెప్పారు.  

ఇండిగో స్లాట్లను తగ్గించడం వల్ల ఇతర సంస్థలకు లాభంగా మారనుంది. చాలా రద్దీగా ఉండే ఎయిర్‌పోర్టుల్లో తమ సర్వీసులు నడిపేందుకు అవకాశం ఉంటుంది. దేశంలో ఇండిగోకు విమాన సర్వీసుల్లో 60 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ స్లాట్ల కోత వల్ల ఇండిగోపై ప్రభావం అంతగా ఉండదని కూడా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ నిర్ణయం వల్ల ఇండిగోకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే చర్యలు తప్పవనే మెసేజ్‌ వెళ్తుందని భావిస్తున్నాయి.

Also Read: ఇండిగో సంక్షోభానికి ఈ 5 కారణాలే.. కేంద్రానికి సంచలన లేఖ!

మరోవైపు స్లాట్ల కోత గురించి ఇండిగో(indigo airlines flight) ఇప్పటివరకు స్పందించలేదు. షెడ్యూళ్ల సమీక్ష, గ్రౌండ్‌ సర్వీసులను మరింత సమర్థంగా నిర్వహించడం కోసం ప్లా్న్లు రూపొందించుకుంటుదని నిపుణులు భావిస్తున్నారు. ఇక ఈ స్లాట్ల కోత వల్ల విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు దీనిపై ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు. - IndiGo Crisis

Advertisment
తాజా కథనాలు