DGCA కీలక నిర్ణయం.. విమానాల్లో పవర్‌బ్యాంక్ నిషేధం!

ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానంలో ప్రయాణికుడి పవర్‌బ్యాంక్ మంటలు చెలరేగడం, మరొక విమానంలోనూ పొగ రావడం వంటి వరుస ఘటనలు ప్రయాణికుల్లో ఆందోళనలు పెంచుతున్నాయి. విమానాల్లో పవర్‌బ్యాంక్ తీసుకువెళ్లడం, వాటి ఉపయోగించడంపై నిషేధం విధించాలని డీజీసీఏ యోచిస్తోంది.

New Update
ban on use of power bank

విమాన ప్రమాదాల్లో పవర్‌బ్యాంక్ పేలుడు ఘటనలు తరచుగా ఇబ్బంది కలిగిస్తున్నాయి. దీంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానం(Indigo Flight) లో ప్రయాణికుడి పవర్‌బ్యాంక్ మంటలు చెలరేగడం, మరొక విమానంలోనూ పొగ రావడం వంటి వరుస ఘటనలు ప్రయాణికుల్లో ఆందోళనలు పెంచుతున్నాయి. విమానాల్లో పవర్‌బ్యాంకులను తీసుకువెళ్లడం, వాటిని ఉపయోగించడంపై కఠినమైన కొత్త నిబంధనలను రూపొందించాలని డీజీసీఏ యోచిస్తోంది.

Also Read :  సుప్రీం కోర్టుకు కొత్త CJI.. బీఆర్ గవాయ్ తర్వాత ఆయనకే బాధ్యతలు!

Power Banks Ban In Flights 

లిథియం-అయాన్ బ్యాటరీలతో నడిచే పవర్‌బ్యాంకులు 'థర్మల్ రన్‌అవే' అనే ప్రక్రియ కారణంగా వేడెక్కి మంటలు లేదా పేలుళ్లకు దారితీసే ప్రమాదం ఉంది. విమాన క్యాబిన్ వంటి పరిమిత ప్రదేశంలో ఇది తీవ్రమైన భద్రతా సమస్యలను సృష్టిస్తుంది. ఈ ప్రమాదాలను నివారించేందుకు, ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న విమానయాన భద్రతా పద్ధతులు, సాంకేతిక నివేదికలను డీజీసీఏ పరిశీలిస్తోంది.

కొత్తగా రాబోయే మార్గదర్శకాల్లో పవర్‌బ్యాంకుల సంఖ్యపై పరిమితి విధించడం, వాటి సామర్థ్యం స్పష్టంగా కనిపించేలా చూడటం, ప్రయాణంలో వాటిని భద్రపరచాల్సిన నిర్దిష్ట స్థలాల గురించి సూచనలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా, విమానంలో పవర్‌బ్యాంకులను ఛార్జింగ్ చేయడం లేదా ఉపయోగించడంపై పూర్తిగా నిషేధం విధించే అంశాన్ని డీజీసీఏ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం, పవర్‌బ్యాంకులను కేవలం హ్యాండ్ బ్యాగేజీలో మాత్రమే తీసుకెళ్లాలి, చెక్-ఇన్ లగేజీలో అనుమతించరు. 100Wh మించి సామర్థ్యం ఉన్న వాటికి ఎయిర్‌లైన్ అనుమతి తప్పనిసరి. కొత్త నిబంధనలు విమాన ప్రయాణ భద్రతను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ మేరకు త్వరలోనే డీజీసీఏ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నిబంధనలు అమలులోకి వస్తే, ప్రయాణికులు తమ వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాల వాడకంపై మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

Also Read :  మరో దారుణం.. తల్లిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు

Advertisment
తాజా కథనాలు