/rtv/media/media_files/2025/07/14/air-india-2025-07-14-21-08-58.jpg)
DGCA asks airlines to check fuel switch locking system in Boeing 737, 787 jets
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం ఇంజిన్లకు ఇంధన సరఫరా ఆగిపోవడం వల్లే జరిగిందన్న సంగతి తెలిసిందే. విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (AAIB) ఈ విషయాన్ని ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం విమానాల ఇంధన స్విచ్‌ల అంశం చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా డీజీసీఏ (DGCA) విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Also read: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. 10 లక్షల మందికి ఉపాధి
DGCA Asks Airlines To Check Fuel Switch Locking System
తమ దగ్గర ఉన్న బోయింగ్ 787, 737 విమానాల్లో ఇంధన స్విచ్ లాకింగ్ సిస్టమ్‌లను తనిఖీ చేయాలని సూచనలు చేసింది. ‘స్పెషల్ ఎయిర్‌వర్తీనెస్ ఇన్‌ఫర్మేషన్ బులెటిన్స్ (NAIB) ప్రకారం.. ప్రస్తుతం చాలావరకు దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలు వాళ్ల విమానాల్లో తనిఖీలు ప్రారంభించాయని మాకు సమాచారం అందింది. అందుకే బోయింగ్ 787, 737 విమానాల ఆపరేటర్లు జులై 21 లోగా ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థల తనిఖీలు పూర్తి చేయాలి. ఆ తర్వాత దీనికి సంబంధించిన రిపోర్టులను డీజీసీఏకు సమర్పించాలని'' DGCA ఉత్తర్వులో పేర్కొంది.
Also Read: అన్‌డాకింగ్ సక్సెస్‌ఫుల్.. మరికొన్ని గంటల్లో భూమిపైకి శుభాంశు బృందం
ప్రస్తుతం బోయింగ్ 787,737 రకం విమానాలను.. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిరిండియా, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్ వంటి సంస్థలు నడిపిస్తున్నాయి. అయితే ఎతిహాద్ ఎయిర్‌వేస్‌తో పాటు దక్షిణ కొరియాకు చెందిన విమానయాన సంస్థలు కూడా ఇంధన స్విచ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తమ పైలట్లకు ఇదివరకే సూచనలు చేసినట్లు ఆయా మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇంధనాన్ని కంట్రోల్ చేస్ స్విచ్‌లతో పాటు ఇతర స్విచ్‌లను ఆపరేట్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పినట్లు వెల్లడించాయి.
Also Read: మోదీపై అభ్యంతరకర కార్టూన్.. భావా ప్రకటన స్వేచ్ఛ దుర్వినియోగంపై సుప్రీం ఆగ్రహం
ఇది కూడా చూడండి:BIG BREAKING: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్
telugu-news | rtv-news | national-news | air india