/rtv/media/media_files/2025/12/05/indigo-2025-12-05-13-44-36.jpg)
DGCA withdraws ‘weekly rest’ clause, partial relief for IndiGo
IndiGo: ఇండిగో విమాన సర్వీసుల రద్దు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పైలట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతి నిబంధనను DGCA ( డిజిటల్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఎత్తివేసింది. ఇండిగో సంక్షోభం నెలకొన్న వేళ డీజీసీఏ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గత కొన్నిరోజులుగా ఇండిగో విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా వందలాది విమానాల సర్వీసులు రద్దు చేశారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
#BREAKING: #DGCA relaxes a clause which debarred airlines to club leaves with weekly rest to mitigate #IndiGo crisis
— Economic Times (@EconomicTimes) December 5, 2025
🔴 Catch the day's latest news here ➠ https://t.co/8eVBGnsJUA 🗞️ pic.twitter.com/KUWc8R2Kso
దీనికి కారణం కొత్తగా ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనలు విధించడమే. పైలట్లు, సిబ్బంది అలసటను నివారించడం కోసం పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) ఈ కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. నవంబర్ 1 నుంచే ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం పైలట్లు, సిబ్బందికి 48 గంటల పాటు విశ్రాంతి ఉంటుంది. గతంలో 36 గంటలు ఉండగా.. దీన్ని 48 గంటలకు పెంచింది. అలాగే రాత్రిపూట విమాన ల్యాండింగ్‌లు కూడా పరిమితంగానే ఉంటాయి.
Also Read: శబరిమలలో తెలుగువారికి వరుస అవమానాలు..నెక్ట్స్ ఏం జరగబోతుంది?
అయితే FDTL రూల్స్‌కు అనుగుణంగా సిబ్బంది అవసరాన్ని అంచనా వేయడంలో ఇండిగో సంస్థ పొరపాట్లు చేసింది. దీంతో సిబ్బంది కొరత ఏర్పడింది. అలాగే పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు, శీతాకాల షెడ్యూల్ మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు సైతం ఈ ప్రభావాన్ని మరింత తీవ్రతరం చేశాయి.
దీని ప్రభావంతో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు సహా దేశంలో ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో వందల సంఖ్యలో ఇండిగో విమానాలు రద్దు కావడం, ఆలస్యం అవ్వడం జరిగింది. వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎయిర్ ఇండియా, విస్తారా, స్పైస్ జెట్ లాంటి సంస్థలకు కూడా ఈ కొత్త నిబంధన ఉంది. కానీ ఇండిగో నుంచి ప్రతిరోజూ ఎక్కువ సంఖ్యలో విమానాలు ప్రయాణిస్తాయి. ఈ క్రమంలోనే ఇందులో సిబ్బంది కొరత ఏర్పడి సంక్షోభం తలెత్తింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు DGCA.. FDTL నిబంధనలు ఎత్తివేస్తూ ఇండిగోకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ నిబంధన సడలింపు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ వరకు మాత్రమే అమల్లో ఉంటాయని పేర్కొంది.
Follow Us