Cyber Crime: సైబర్ క్రైమ్ కలకలం.. ఒక్క నెలలో 55 మంది అరెస్టు
సైబర్ నేరగాళ్లను అరికట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా ఓ ఆపరేషన్‌ను చేపట్టారు. గత నెలలో 196 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. అందులో 55 మందిని అరెస్టు చేశారు.
సైబర్ నేరగాళ్లను అరికట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా ఓ ఆపరేషన్‌ను చేపట్టారు. గత నెలలో 196 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. అందులో 55 మందిని అరెస్టు చేశారు.
సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. కొత్త మార్గాల్లో దోచుకుంటున్నారు. ముఖ్యంగా ఆడవారు, ముసలివారిని వారు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా వెంగళరావునగర్‌కు చెందిన వృద్ధురాలికి అపరిచితుడు వాట్సాప్ కాల్ చేశాడు. ఆమె కొడుక్కు ప్రమాదమంటూ రూ.35.23 లక్షలు కొట్టేశాడు.
ఉద్యోగాల ఆశతో మయన్మార్ చేరుకుని, సైబర్‌క్రైమ్ స్కామ్ హబ్స్‌లో చిక్కుకుపోయిన 500 మందికి పైగా భారతీయలు థాయిలాండ్ సరిహద్దులో చిక్కుకుపోయారు. నకిలీ ఉద్యోగ ప్రకటనలకు బలై, సైబర్ క్రైమ్‌లోకి బలవంతంగా నెట్టబడిన వీరిని కేంద్రం విడిపించడానికి చర్యలు చేపట్టింది.
భారత పోస్టాఫిస్ చఠ్ పూజ సబ్సిడీ లేదా లక్కీ డ్రా రివార్డు పేరుతో ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం క్లారిటీ ఇచ్చింది. ఇదంతా ఫేక్ అని స్పష్టం చేసింది.
సైబర్ నేరగాళ్లు రోజురోజుకి కొత్త వ్యూహాలు రచిస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. తాజాగా లోన్లు ఇచ్చే ఓ యాప్‌కే బురిడి కొట్టించారు. కేవలం 3 గంటల్లోనే రూ.49 కోట్లు కాజేశారు.
దివాళి పండుగ ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఖాతాలను హ్యాక్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి 15 వరకు ఫేక్ నోటిఫికేషన్స్, URL లింకుల ద్వారా 390 మందిని మోసం చేసి, రూ. 8.5 లక్షలు కొట్టేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు.
డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతున్న మోసాలు పేట్రేగిపోతున్నాయి. అమాయకులకు వల వేస్తున్న కేటుగాళ్లు వేలు, లక్షలు, కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు.
సైబర్ మోసాలు పెరుగుతున్నప్పటికీ కొంతమంది అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా బ్రాండెడ్ వస్తువులకు రేటింగ్ ఇస్తే కమిషన్ ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు ఓ ఐటీ ఉద్యోగికి ఆశ చూపారు. అది నిజమని నమ్మిన సదరు ఉద్యోగి నిండా మునిగాడు.
బెంగళూరుకు చెందిన ఒక ఒంటరి మహిళ పెళ్లికోసం చేసిన ప్రయత్నాలు ఆమెను నిండా ముంచాయి. కోట్ల రూపాయలు కాజేసిన నిందితుడి కోసం ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. మాయమాటలతో రూ.2.5 కోట్ల తన ఖాతాలోకి మళ్లించుకుని మోసగించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.