రూ.54 వేల కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఈమధ్య కాలంలో సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుల్లో సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.54 వేల కోట్లు కాజేశారని ఆందోళన వ్యక్తం చేసింది.

New Update
Supreme Court Responds on digital frauds worth Rs 54,000 crore

Supreme Court Responds on digital frauds worth Rs 54,000 crore

ఈమధ్య కాలంలో సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుల్లో సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.54 వేల కోట్లు కాజేశారని ఆందోళన వ్యక్తం చేసింది. కొల్లగొట్టిన ఈ సొమ్ము చిన్న రాష్ట్రాల బడ్జెట్‌ కన్నా ఎక్కువని చెప్పింది. వీటిని అరికట్టేందుకు RBI, బ్యాంకులు, టెలికమ్యూనికేషన్ విభాగం సంప్రదింపులతో నిర్ణీత ప్రమాణ కార్యాచరణను (SoP)ను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

Also Read: ఏప్రిల్ 1 నుంచి "ఫాస్టాగ్ కొత్త రూల్" వాహనదారులు అలర్ట్‌ అవ్వాల్సిందే..

ఇందుకోసం నాలుగు వారాల గడువు ఇచ్చింది. అంతేకాదు ఆ నేరాలకు కొందరు బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం, కుట్ర కూడా ఉండే ఛాన్స్ ఉందని పేర్కొంది. సైబర్‌ క్రైమ్ వ్యవహారంలో ఆర్‌బీఐ, బ్యాంకుల నుంచి సకాలంలో చర్యలు ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక డిజిటల్ అరెస్టు కేసుల్లో పరిహారానికి సంబంధించి RBI, టెలికమ్యూనికేషన్ విభాగంతో పాటు ఇతర విభాగాలు కలిసి భేటీ కావాలని సూచించింది. తదుపరి విచారణ కోసం నాలుగు వారాలు వాయిదా వేసింది. 

Also Read: వ్యభిచారానికి అత్తమామలు బలవంతం.. కోడలు ఆత్మహత్య!

ఇదిలాఉండగా సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకింగ్‌ వినియోగదార్లకు RBI ఇటీవల ఉపశమనాన్ని ప్రకటించింది. మోసపూరిత లావాదేవీ జరిగితే రూ.25 వేల పరిహారం అందించనుంది. మోసగాళ్లకు ఓటీపీ ఇచ్చి ఆన్‌లైన్‌లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్లకు ఈ పరిహారం అందుతుందని ఆర్బీఐ గవర్నర్‌ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు.  

Advertisment
తాజా కథనాలు