Cyber Criminals: జేడీ లక్ష్మీనారాయణ భార్యకు సైబర్ నేరగాళ్ల వల.. రూ.2.58 కోట్లు మాయం

తాజాగా మాజీ జాయింట్‌ డైరెక్టర్‌, మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో ఆమె నుంచి ఏకంగా రూ.2.58 కోట్లు కాజేశారు.

New Update
Ex-IPS officer’s wife duped of Rs 2.58 crore in Hyderabad

Ex-IPS officer’s wife duped of Rs 2.58 crore in Hyderabad

సైబర్ నేరగాళ్లు(Cyber ​​Criminals) రోజురోజుకు రెచ్చిపోతున్నారు. అమాయకులకు వల వేసి వేలు, లక్షలు, కోట్లు దోచేస్తున్నారు. తాజాగా మాజీ జాయింట్‌ డైరెక్టర్‌, మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ(jd-laxmi-narayana) భార్య ఊర్మిళ కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో ఆమె నుంచి ఏకంగా రూ.2.58 కోట్లు కాజేశారు. ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. గతేడాది నవంబర్ చివరి వారంలో లక్ష్మీనారాయణ భార్యకు గుర్తు తెలియని నెంబర్‌ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. తాము చెప్పినట్లు స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే ఎక్కువగా లాభాలు వస్తాయని అందులో పేర్కొన్నారు. 

Also Read: శవాలు కొనే కశ్మీర్‌ ముస్లీం.. అయోధ్య రామమందిరంలో నమాజ్

Ex-IPS Officer JD Laxmi Narayana Wife Duped Of Rs 2.58 Crore

వాళ్లు చెప్పిన విషయాన్ని ఊర్మిళ నమ్మింది. దీంతో సైబర్ నేరగాళ్లు(Cyber ​​Crime) 'స్టాక్‌ మార్కెట్‌ ప్రాఫిట్‌ గైడ్ ఎక్సేంజ్ 20' అనే వాట్సాప్ గ్రూప్‌లో నవంబర్ 29న ఆమె భర్త లక్ష్మీనారాయణ నెంబర్‌ను యాడ్‌ చేశారు. ఆ గ్రూపులో చేరిన కొద్దిసేపటికే దినేష్ సింగ్ అనే వ్యక్తి ఊర్మిళతో మాట్లాడాడు. తాను ఐఐటీ ముంబై గ్రాడ్యుయేట్‌నని, అమెరికాలో PHD చేసినట్లు చెప్పుకున్నాడు. అంతేకాదు తాను రాసిన స్టాక్‌ మార్కెట్‌ ట్రెజర్ హంటింగ్‌ సీక్రెట్స్‌ అనే బుక్‌ను కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు చెప్పాడు. 

Also Read: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు భారీ షాక్.. 63 మంది నక్సలైట్లు లొంగుబాటు

దినేష్ సింగ్ వాట్సాప్‌ గ్రూపులో ఉన్న సభ్యులకు ట్రేడింగ్‌పై శిక్షణ తరగతులు నిర్వహించేవాడు. అలాగే పెట్టుబడులు పెట్టేందుకు పలు స్టాక్స్‌ను కూడా సిఫార్సు చేసేవాడు. ఇందులో పెట్టుబడులు పెట్టిన వాళ్లు లాభాలు పొందారని.. దీనికి సంబంధించి కొన్ని స్క్రీన్‌షాట్లు కూడా గ్రూపులో పోస్టు చేసేవాడు. వాటిలో పెట్టుబడులు పెడితే 500 శాతం లాభాలు వస్తాయని చెప్పేవాడు. అంతేకాదు సెబీ నుంచి గుర్తింపు పొందిన మొకిన్లీ అనే సంస్థ ద్వారా బ్రోకరేజ్‌ సేవలు పొందుతున్నట్లు నమ్మించాడు. దినేశ్ సింగ్ మాటలు నమ్మిన ఊర్మిళ 2025 డిసెంబర్ 24 నుంచి జనవరి 5 మధ్య 19 విడతలుగా మొత్తం 2.58 కోట్లను ట్రేడింగ్ ఖాతాకు బదిలీ చేశారు. అలాగే తన భర్త వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టిమరీ రుణం తీసుకున్నారు. ట్రేడింగ్ ఖాతాలో లాభాలు కనిపించినప్పటికీ.. విత్‌డ్రా ఆప్షన్ లేదు. మరింత పెట్టుబడులు పెట్టకపోతే ఇప్పటిదాకాపెట్టిన డబ్బు పోతుందని బెదిరించారు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన ఊర్మిళ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. సైబర్‌ నేరగాళ్లు మ్యూల్‌ అకౌంట్లకు డబ్బును పంపించారని..వాటిని గుర్తించేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

Advertisment
తాజా కథనాలు