/rtv/media/media_files/2025/11/23/telangana-ministers-whatsapp-group-hacked-2025-11-23-14-51-51.jpg)
Telangana Ministers Whatsapp group hacked
సైబర్ నేరగాళ్లు(Cyber ​​Crime) రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా పలువురు తెలంగాణ మంత్రుల వాట్సప్ మీడియా గ్రూప్‌లు హ్యాక్(Telangana Misters WhatsApp Media Groups Hacked) కావడం కలకలం రేపుతోంది. SBI కేవైసీ పేరుతో సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైల్స్‌ను పంపుతున్నారు. ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలని SBI పేరుతో మంత్రులు, జర్నలిస్టులకు మెసేజ్‌లు చేస్తున్నారు. దీంతో ఏపీకే ఫైల్స్‌ను ఓపెన్ చేయవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచనలు చేస్తున్నారు.
Also Read: సంక్రాంతికి ఊరెళ్లుతున్నారా? బస్సులు, రైల్లు ఫుల్ రిజర్వేషన్..టికెట్ ధర ఎంతో తెలుసా?
TG Ministers WhatsApp Groups Hacked
గత రెండ్రోజులగా వాట్సాప్ గ్రూప్‌లు హ్యాక్ అవుతున్నాయని రిపోర్టులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. హ్యాకర్లు డేటాను దొంగిలించడం కోసం లేదా మీ అకౌంట్‌ను కంట్రోల్ చేసేందుకు ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారని అంటున్నారు. తెలియని ఏపీకే ఫైల్స్‌ను ఓపెన్ చేయొద్దని.. ఇన్‌స్టాల్ చేయొద్దని సూచిస్తున్నారు. అలాగే ఫార్వార్డ్ చేసే మెసెజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇందుకోసం వాట్సాప్‌లో టూ స్టెప్ వెరిఫికేషన్ చేయాలని అంటున్నారు.
Follow Us