/rtv/media/media_files/2026/01/30/sanchar-saathi-powers-india-cyber-fraud-crackdown-2026-01-30-20-50-07.jpg)
1.52 Crore Mobile Numbers Blocked, Sanchar Saathi Powers India's Cyber Fraud Crackdown
కేంద్ర ప్రభుత్వం(central-government) సైబర్ నేరాలు(Cyber ​​Crime), చోరీలను నియంత్రించేందుకు సంచార్ సాథీ’ యాప్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్ ద్వారా ఇప్పటివరకు 1.52 కోట్ల మొబైల్ నెంబర్లను బ్లాక్ చేసింది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటిదాకా 'సంచార్ సాథీ'(Sanchar Saathi) యాప్‌ను 2 కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపారు. ఈ యాప్ ద్వారా చట్టవ్యతిరేక, అనుమానస్పద కార్యకలాపాలతో లింక్ ఉన్న 1.52 కోట్ల మొబైల్ నెంబర్లను బ్లాక్ చేశామని పేర్కొన్నారు. - Cyber ​​Criminals
Also Read: ఫోన్లోనే ఆధార్‌లో మొబైల్ నంబర్, అడ్రస్ అప్డేట్.. అదిరిపోయే కొత్త యాప్ ఇదే!
Cyber Crime - 1.52 Crore Mobile Numbers Blocked
మోసపూరిత సిమ్‌లతో లింక్ అయి ఉన్న 27 లక్షల వాట్సాప్ అకౌంట్‌లతో సహా ఇతర డిజిట్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లను సైతం బ్లాక్ చేసినట్లు చెప్పారు. సైబర్ నేరాలను నియంత్రించేందుకు సంచార్ సాథీ బలమైన ఆయుధంగా పనిచేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు గతంలో విదేశీ కాలర్ల నుంచి సుమారు 1.35 కోట్ల ఫేక్ కాల్స్ రికార్డయ్యేవన్నారు.
Also Read: ఇమ్రాన్ ఖాన్‌కు సీరియస్.. జైల్లోనే హతమార్చే కుట్ర.. అసలేం జరుగుతోంది?
ప్రస్తుతం చూసుకుంటే ఇలాంటి కాల్స్ దాదాపు 95 శాతం తగ్గినట్లు పేర్కొన్నారు. ఈ యాప్ నుంచి కేంద్రం ప్రజల వ్యక్తిగత జీవితాలపై నిఘా పెడుతుందని ఇటీవల ప్రచారం నడిచింది. అయితే ఈ వార్తలను మంత్రి ఖండించారు. ఇందులో నిజం లేదని పేర్కొన్నారు. ఈ యాప్‌లో అసలు స్నూపింగ్‌కు తావు లేదని.. అది సాధ్యం కాదని స్పష్టం చేశారు.
Follow Us