/rtv/media/media_files/2025/11/24/whatsapp-2025-11-24-20-21-20.jpg)
ఇటీవల తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూప్ హ్యాక్ కావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. SBI బ్యాంక్ పేరుతో ప్రమాదకర ఏపీకే పైల్స్‌ను షేర్ చేశారు. ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తూ మెసేజ్ చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. వాట్సాప్‌లో వచ్చే ఎలాంటి ఏపీకే ఫైల్స్‌ను ఓపెన్ చేయొద్దని సూచనలు చేస్తున్నారు. అయితే ఒక వాట్సాప్ గ్రూప్‌ను లేదా వ్యక్తిగత అకౌంట్‌ను ఎలా హ్యాక్ చేస్తారు ? అనధికారికంగా ఎలా యాక్సెస్ చేస్తారు ? అనేదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: సమయం ఇవ్వండి, లొంగిపోతాం.. మావోయిస్టుల సంచలన లేఖ
సాధారణంగా వాట్సాప్ అనేది ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ సాంకేతికతను వినియోగిస్తుంది. అంటే మెసేజ్‌లు, వాయిస్ రికార్డింగ్, కాల్స్‌ను ఆ ఇద్దరు మాత్రమే చూడగలరు. మిగతా వారు వాటిని యాక్సెస్ చేయలేరు. అందుకే సైబర్ నేరగాళ్లు ఈ ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీని బద్దలు కొట్టేందుకు బదులుగా యూజర్ల బలహీనతను టార్గెట్‌గా చేసుకుంటున్నారు. వాట్సాప్ అకౌంట్‌ను అక్రమంగా యాక్సెస్ చేసేందుకు హ్యాకర్లు కొన్ని పద్ధతులు వాడుతుంటారు.
OTPని దొంగిలించడం
వాట్సాప్ అకౌంట్‌ను కంట్రోల్ చేసేందుకు ఉపయోగించే అత్యంత సాధారణ పద్ధతి సోషల్ ఇంజినీరింగ్. దీనిద్వారా ఓటీపీని దొంగిలిస్తారు. అంటే హ్యాకర్ మొదటగా తాను టార్గెట్ చేసిన కొత్త డివైజ్‌లో వాట్సాప్‌ను ఇన్‌స్టాల్ చేసి, రిజిస్ట్రేషన్ కోడ్ పంపేలా చేస్తాడు. టార్గెట్ చేసిన వ్యక్తి వేరే నెంబర్ నుంచి లేదా ఏదైనా కంపెనీ నుంచి ఫోన్ లేదా మెసేజ్ చేస్తాడు. ఓటీపీ పంపాలని లేదంటే మీ అకౌంట్ బ్లాక్ అవుతుందని చెబుతాడు. దీనివల్ల బాధితుడు తెలియక ఓటీపీ పంపిస్తే హ్యాకర్ ఆ అకౌంట్‌ను యాక్సెస్ చేస్తాడు.
మాల్‌వేర్ దాడి
హ్యాకర్లు టార్గెట్ చేసిన వ్యక్తుల మొబైల్‌లోకి రహస్యంగా మాల్‌వేర్‌ను లేదా స్పైవేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు. హ్యాకర్ ఫిషింగ్ లింక్‌లు, ఫేక్ యాప్స్ లేదా మెసేజ్‌ల ద్వారా మాల్‌వేర్‌ను పంపిస్తాడు. ఒకవేళ యూజర్ దాన్ని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే అది వాట్సాప్ సందేశాలతో పాటు అన్ని కమ్యూనికేషన్లను సీక్రెట్‌గా హ్యాకర్‌కు పంపిస్తుంది. దీంతో ఆ మొబైల్ హ్యాకర్ల కంట్రోల్‌లోకి వెళ్తోంది. గతంలో పెగాసస్ స్పైవేర్‌ను వినియోగించి జర్నలిస్టులు, రాజకీయ నాయకుల ఫోన్‌లో దీన్ని వినియోగించి వాళ్ల వాట్సాప్ సందేశాలు ట్రాక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
Also Read: ఎన్నికల కమిషన్ చేపట్టిన SIR అంటే ఏంటీ? రాజకీయ పార్టీల అభ్యంతరాలు దేనికి?
వాట్సాప్ వెబ్/డెస్క్‌టాప్ దుర్వినియోగం
హ్యాకర్లు వాట్సాప్ వెబ్ లేదా డెస్క్‌టాప్ సెషన్‌ను యాక్సెస్ చేయగలిగితే అకౌంట్‌ను పర్యవేక్షించగలరు. టార్గెట్ చేసిన వ్యక్తి ఫోన్ అన్‌లాక్‌లో ఉంటే కొద్ది నిమిషాల్లోనే హ్యాకర్ QR కోడ్‌ను స్కాన్ చేసి.. వాట్సాప్ వెబ్‌కి లింక్ పంపిస్తాడు. దాన్ని ఓపెన్ చేస్తే ఆ వ్యక్తి ఫోన్ ఆఫ్‌లైన్‌లో ఉన్నా కూడా హ్యాకర్ వాళ్ల మెసేజ్‌లు, గ్రూప్ చాట్‌లను పర్యవేక్షించొచ్చు.
Follow Us