TG NEWS: మూడు రోజుల్లోనే ఘోరం! పెళ్లి కూతురిగా వెళ్లి.. శవంగా ఇంటికి!
కరీంనగర్ జిల్లా వెల్గటూరు గ్రామానికి చెందిన అఖిల అనే యువతికి పెళ్ళైన మూడు రోజులకే ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించింది. పరీక్ష రాసి తిరిగి భర్తతో బైక్ పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది.
కరీంనగర్ జిల్లా వెల్గటూరు గ్రామానికి చెందిన అఖిల అనే యువతికి పెళ్ళైన మూడు రోజులకే ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించింది. పరీక్ష రాసి తిరిగి భర్తతో బైక్ పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది.
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. 28 ఏళ్ల ఓ వ్యక్తిని కత్తితో పొడిచి తుపాకీతో కాల్చి చంపేశారు దుండగులు. ముందుగా దొంగతనంలో భాగంగా ఈ హత్య జరిగి ఉండవచ్చునని పోలీసులు , కుటుంబ సభ్యులు భావించారు.
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు కుటుంబాలను వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు తిరిగి వచ్చి పెళ్లి చేసుకున్నామని, కలిసి జీవించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించి వారి నిర్ణయాన్ని మార్చుకోవడానికి నిరాకరించారు.
బీహార్‌లోని దర్భంగా మెడికల్ కాలేజీ ప్రాంగణంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తండ్రి, తన కూతురి కులాంతర వివాహం చేసుకుందని అల్లుడిని ఆమె కళ్ళముందే కాల్చి చంపాడు. మృతుడు రాహుల్ కుమార్ (25) అనే బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిగా గుర్తింపు.
హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట ఎల్లమ్మబండలో టీ తాగుతున్న షేక్ మహమూద్ అనే రౌడీషీటర్‌ను ముగ్గురు యువకులు విచక్షణా రహితంగా కత్తులు.. వేటకొడవలితో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడి జరిగిన తర్వాత నిందితులు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు.
ప్రియురాలి కోసం కట్టుకున్న భార్య, కన్న పిల్లలు అనే కనీస కనికరం లేకుండా ఇంట్లో నుంచి గెంటేశాడు కసాయి భర్త. ఈ ఘటన హైదరాబాద్ ఉప్పల్ లోని వెంకటరెడ్డి నగర్ లో వెలుగుచూసింది.
హైదరాబాద్‌లోని ఉప్పర్‌పల్లి 173వ పిల్లర్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కన్న తండ్రిని చంపడానికి సిద్దమయ్యాడు దుర్మార్గపు కొడుకు. అదృష్టవశాత్తు అతడి ప్లాన్ ఫలించకపోవడంతో ఆ తండ్రి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ అమానుష ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వెలుగు చూసింది.