TG Crime: హైదరాబాద్‌లో మైనర్ల వీరంగం.. కారు బోల్తా, నలుగురికి తీవ్ర గాయాలు

హైదరాబాద్‌లోని ఉప్పర్‌పల్లి 173వ పిల్లర్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.

New Update

TG Crime:  

Hyderabad: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ చర్యలు చేపడుతున్నప్పటికీ నగరంలోని ఏదో ఒక మూలన రోజుకొక రోడ్డు ప్రమాదం వెలుగు చూస్తోంది. కొందరు గాయపడి శరీర అవయవాలను పోగొట్టుకుంటుంటే.. మరికొందరు ఏకంగా శ్వాసను విడుస్తున్నారు. దీంతో బాధితుల కుటుంబాలు ఆవేదనకు గురవుతున్నాయి. అయితే చాలా వరకు ప్రమాదాలు డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా యువత నిర్లక్ష్యమైన డ్రైవింగ్ వారితోపాటు ఇతరుల ప్రాణాలకు ప్రమాదంగా మారుతోందని నిపుణులు అంటున్నారు. నిపుణుల మాటలను బలపరిచేలా నగర శివార్లలోని అత్తాపూర్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. ఉప్పర్‌పల్లిలోని పిల్లర్ నంబర్ 173 వద్ద అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

కారుతో రోడ్డుపై వీరంగం..

ప్రమాదం జరిగిన తీరు చూస్తే కారు వేగంగా వస్తూ డివైడర్‌ను (Divider) ఢీకొట్టడంతో ఒక్కసారిగా గాల్లోకి లేచి పక్కకు పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కారులో ఉన్న వారు తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ కారులోని ఎయిర్‌బ్యాగ్‌లు (Airbag) సకాలంలో తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ప్రమాదానికి గురైన యువకులను అతికష్టం మీద బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువకులు అతివేగంగా కారును నడపడమే ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కారులో ఉన్న యువకులు చాలా వేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ రోడ్డుపై వీరంగం సృష్టించారు. ఈ నిర్లక్ష్యమే(neglect) ప్రమాదానికి కారణమని వారు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: బలూచిస్తాన్‌లో భీకరమైన దాడి.. పాక్ సైనికులు 10 మంది మృతి
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని పోలీసులు (police) హెచ్చరించారు. ఈ ప్రమాదం హైదరాబాద్‌లో(Hyderabad) పెరుగుతున్న రహదారి భద్రతా సమస్యలను మరోసారి ఎత్తిచూపుతోందన్నారు. నగరంలో వేగంగా పెరుగుతున్న ట్రాఫిక్, వాహనాల సంఖ్య నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. వాహనదారులు స్వీయ నియంత్రణ పాటించాలని కోరుతున్నారు. యువత నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల వారి ప్రాణాలకేకాకుండా.. ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని పోలీసులు హెచ్చరించారు. మైనర్లకు వాహనాలను ఇస్తే తల్లిదండ్రులకు, వాహన యజమానులకు కూడా శిక్ష తప్పదని స్పష్టం చేస్తున్నారు. 18 ఏళ్ళు (18 years old) దాటిన యువత లైసెన్స్ పొందిన తరువాతే వాహనాలను(Vehicles) నడపాలని, లైసెన్స్ లేకుండా వాహనాలను ఎవరు నడిపినా చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు సూచిస్తున్నారు.  

Latest News)

ఇది కూడా చదవండి:
చిన్నాన్న నీకు మనసెలా వచ్చింది!

Advertisment
తాజా కథనాలు