/rtv/media/media_files/2025/08/08/infant-death-2025-08-08-21-48-28.jpg)
Woman Kills Her Newborn After Delivering In Bathroom, Dumps Body In Trash In Delhi
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ మహిళ బాత్‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చి చంపేయడం కలకలం రేపింది. ఆ తర్వాత బిల్డింగ్ ఆవరణలో డస్ట్‌బిన్‌లో మృతదేహాన్ని పారేసింది. మున్సిపల్ సిబ్బంది ఆ శిశువును గర్తించారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆ మహిళను అరెస్టు చేశారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలికి చెందిన రోష్ని(26) అనే యువతికి 2019లో ఓ వ్యక్తితో వివాహం జరిగింది.
Also Read: ఎన్నికల సంఘానికి రాహుల్ గాంధీ వార్నింగ్.. 5 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్
ఆ తర్వాత వీళ్లద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2021లో భర్త నుంచి విడిపోయింది. 2023 నుంచి ఢిల్లీలోని పటేల్ నగర్‌లో ఓ ఇంట్లో పనిమనిషిగా చేస్తోంది. అయితే గతేడాది ఓసారి తన బంధువుల పెళ్లి కోసం రోష్నీ తన సొంతూరుకు వెళ్లింది. అక్కడ తన లవర్‌తో ఆమె లైంగిక సంబంధం పెట్టుకుంది. ఢిల్లీకి వెళ్లాక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తన లవర్‌కు చెబితే అతడు మోహం చాటేశాడు. దీంతో తాను గర్భవతి అన్న విషయాన్ని దాచేందుకు ప్రయత్నాలు చేసింది. చివరికి కడుపులో ఏదో సమస్య ఉన్నట్లు ఇంటి ఓనర్‌కు చెప్పింది .
Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. ఆదాయపు పన్ను బిల్లు 2025 ఉపసంహరణ !
వాళ్లు వైద్యుడి వద్దకు వెళ్లని సూచన ఇచ్చారు. అయితే జులై 26న ఆమె పనిచేస్తున్న ఇంటి యజమాని కుటుంబ సభ్యులు బయటికి వెళ్లారు. చివరికి ఆ ఇంట్లోని బాత్‌రూమ్‌లోనే రోష్ని మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఆ శిశువు గొంతు నొక్కి హత్యకు పాల్పడింది. ఆ తర్వాత ఆ చిన్నారి మృతదేహాన్ని ఓ కవర్‌లో చుట్టి డస్ట్‌బిన్‌లో వేసి వెళ్లిపోయింది. జులై 28న అక్కడి స్థానిక మున్సిపల్ సిబ్బంది ఆ శిశువు మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి వచ్చారు. శిశువు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టంలో ఆ శిశువును గుడ్డతో గొంతునొక్కి తల్లి హత్య చేసినట్లు తేలింది .
Also Read: 'ఆ దేశ అధ్యక్షుడిని పట్టివ్వండి, రూ.430 కోట్లు ఇస్తాం'.. అమెరికా బంపర్ ఆఫర్
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రోష్ని కోసం తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు ఆమెను అరెస్టు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమె ప్రియుడిని సైతం విచారణ చేస్తామని.. దర్యాప్తు మేరకు అరెస్టు కూడా చేస్తామని పోలీసులు తెలిపారు. శిశువును తల్లి హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. మరోవైపు పుట్టిన శిశువును తల్లిదండ్రులు హత్య చేస్తున్న ఘటనలు చాలానే జరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలను పోషించే పరిస్థితి లేని వాళ్లు బిడ్డకు జన్మనిచ్చి చెత్తకుండీలో పారేసి వెళ్లిపోతున్నారు .
Also Read: పెళ్లైన వ్యక్తితో సహజీవనం.. కూతుర్ని నరికి చంపిన తండ్రి.. ప్రియుడి పిటిషన్తో..!