Crime : మరో మహాపతివ్రత.. భర్తను చంపి లవర్ను ఇరికించి.. ట్విస్టుల మీద ట్విస్టులు!

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. 28 ఏళ్ల ఓ వ్యక్తిని కత్తితో పొడిచి తుపాకీతో కాల్చి చంపేశారు దుండగులు. ముందుగా దొంగతనంలో భాగంగా ఈ హత్య జరిగి ఉండవచ్చునని పోలీసులు , కుటుంబ సభ్యులు భావించారు.

New Update
up crime news

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. 28 ఏళ్ల ఓ వ్యక్తిని కత్తితో పొడిచి తుపాకీతో కాల్చి చంపేశారు దుండగులు. ముందుగా దొంగతనంలో భాగంగా ఈ హత్య జరిగి ఉండవచ్చునని పోలీసులు , కుటుంబ సభ్యులు భావించారు. కానీ దీని వెనుక అక్రమసంబంధం ఉందని పోలీసులు తేల్చారు. పక్కా స్కెచ్ ప్రకారమే ఈ హత్య చేశారని పోలీసులు కనిపెట్టారు. షానవాజ్ తన భార్య మైఫ్రీన్‌తో కలిసి తన బావమరిది వివాహానికి బైక్‌పై వెళుతుండగా అతనిపై ఎటాక్ జరిగింది. రెండు  బైకులపై వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు షానవాజ్ బైక్‌ను అడ్డగించి అతన్ని కర్రలతో కొట్టి, పలుసార్లు పొడిచారు. అంతేకాకుండా నిందితుల్లో ఒకరు అతన్ని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం హంతకులు అక్కడి నుంచి పారిపోయారు.

మైఫ్రీన్ పోలీసులకు ఫిర్యాదు

కొంతమంది స్థానికులు వెంటనే షానవాజ్‌ను సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.   అయితే అప్పటికే అతను చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. అతని చేయి, ఛాతీ, మెడపై మూడు లోతైన కత్తిపోట్లను గుర్తించారు. హర్యానా నివాసి అయిన షానవాజ్ ఫర్నిచర్ వర్క్ చేస్తాడు.  ఈ ఘటనపై మైఫ్రీన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొంతమంది తమను దోచుకోవడానికి ప్రయత్నించారని, తన భర్త ప్రతిఘటించడంతో అతన్ని చంపేశారని ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన  పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి.  దర్యాప్తులో షానవాజ్ వరుసకు తమ్ముడయ్యే బంధువుతో తాసవ్వూరుతో అక్రమసంబంధం ఉంది.  వీరి సంబంధానికి భర్త అడ్డంకిగా మారుతున్నాడని భావించి అతని హత్యకు ప్లాన్ చేశారు. బావమరిది పెళ్లికి వెళ్తున్న టైమ్ లో ఎటాక్‌ చేసి చంపేశారు. పోలీసులకు నిందితులు దొరకకగా  షానవాజ్ భార్య మాత్రం కనిపించకుండా పోయింది.  ఆమె అచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.  

ప్రేమించిందని 18ఏళ్ల కూతుర్ని చంపేశాడు 

గుజరాత్‌ లో దారుణం జరిగింది.  ప్రేమించిందని 18ఏళ్ల కూతుర్ని చంపేశాడు ఓ తండ్రి.  ప్రియుడు హరేష్‌ చౌదరి హెబియస్ కార్పస్ పిటిషన్‌తో ఈ నిజం బయటపడింది. బనస్కాంత జిల్లా దంతియా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వడ్గాండ గ్రామానికి చెందిన హరేష్‌ చౌదరితో చంద్రిక(18) ప్రేమాయణం నడుపుతుంది.  ఈ విషయం చంద్రిక ఇంట్లో తెలిసింది. అయితే హరేష్‌కు అప్పటికే వివాహం జరగడం, ఓ కుమారుడు కూడా ఉండటంతో చంద్రిక పేరెంట్స్ అందుకు ఒప్పుకోలేదు. దీంతో అహ్మదాబాద్‌ పారిపోయి హరేష్, చంద్రిక సహజీవనం  చేస్తున్నారు. దీంతో జూన్‌ 12న రాజస్థాన్‌లో చంద్రికను పట్టుకొని బంధువులు ఇంటికి తీసుకెళ్లారు. పాత కేసులో జైలుకెళ్లిన హరేష్‌, జూన్ 21న విడుదలయ్యాడు. జూన్ 17న తన కుటుంబం తనను చంపేస్తారని హరేష్‌ కు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మెసేజ్‌ చేసింది చంద్రిక.  అయితే జైలులో ఉన్నందున హరేష్‌ వాటిని చూడలేకపోయాడు. కూతురు చేసిన పనుల వలన తన  పరువుపోయిందని భావించిన చంద్రిక తండ్రి సేందాభి పటేల్ ఆమెను చంపేయాలని నిర్ణయించాడు. ఆమెకు పాలలో నిద్రమాత్రాలు కలిపి ఇచ్చారు. జూన్ 24 అర్థరాత్రి ఆమె స్పృహ కోల్పోగానే గొంతు కోసి చంపేశాడు. అనంతరం ఎవరికి తెలియకుండా ఆమె అంత్యక్రియలు కూడా నిర్వహించారు. 

Advertisment
తాజా కథనాలు